Crime News : ఫ్రెండ్ భార్యను చెల్లెలుగా భావించాల్సింది పోయి ఆమె మీదే కన్నేశాడో వ్యక్తి. ఆమెను మాటలు, కాస్ట్‌లీ గిఫ్టులతో వశ పర్చుకుని అక్రమ సంబంధం మొదలుపెట్టాడు. ఫ్రెండ్ నైట్ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇద్దరు ఒక్కటయ్యేవారు. వీరి సంబంధం గురించి తెలుసుకున్న ఆ భర్త, స్నేహితుడ్ని దారుణంగా చావగొట్టాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, మధురై జిల్లాకు చెందిన మునిస్వామి, చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న కదిరన్‌కు, మునిస్వామికి మంచి స్నేహం ఏర్పడింది. లాక్‌డౌన్ సమయంలో మునిస్వామికి అదే ప్రాంతానికి చెందిన కరుణతో పెళ్లయింది. కరోనా పరిస్థితి చక్కబడ్డ తర్వాత భార్యను తీసుకుని వెళ్లాడు.
తాను ఇదివరకు ఉంటున్న గదిలోనే దిగారు. అయితే, ఇంటి ఓనర్‌కు మునిస్వామికి గొడవ కావటంతో వీలైనంత త్వరగా ఇంటిని ఖాళీ చేయాలని ఓనర్ అన్నాడు. దీంతో అతడు ఇంటికోసం వెతుక్కోవటం మొదలుపెట్టాడు. ఎంత వెతికినా ఆఫీసుకు దగ్గరలో రూము దొరకలేదు. ఈ నేపథ్యంలో తాను ఉండే ప్లాట్లో రూమ్ ఖాళీ ఉందని కదిరన్ చెప్పాడు. ఇళ్లు నచ్చటంతో అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఒకే ఫ్లాట్‌లో ఉండటంతో కదిరన్, మునిస్వామి ఇంటికి తరచు పోయే వాడు. అవివాహితుడైన అతడు వీలైనన్ని సార్లు ఆ ఇంట్లోనే భోజనం చేసేవాడు. కదిరన్‌తో కలిసి మునిస్వామి ఆఫీసుకు వెళ్లి వచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత మునిస్వామికి నైట్ షిఫ్టులు మొదలయ్యాయి.
సాయంత్రం 5 గంటలకు పోయిన వాడు.. ఉదయం 4 గంటలకువచ్చేవాడు. సాయంత్రం మునిస్వామి డ్యూటీకి పోగానే కదిరన్ ఆఫీసునుంచి వచ్చేవాడు. ఆ తర్వాత ఫ్రెండ్ ఇంటికి వెళ్లి కరుణతో బాతాకాని కొట్టేవాడు. రోజులు గడుస్తున్నాయి. మొదటి నుంచి కరుణపై కన్నున్న కదిరన్ మాటలతో, కాస్ట్‌లీ గిఫ్టులతో ఆమెను మచ్చిక చేసుకున్నాడు. మునిస్వామికి నైట్ షిఫ్టులు ఎక్కువ రోజులు వచ్చేలా చేశాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఇంట్లో కొత్తకొత్త గిఫ్టులు చూసిన మునిస్వామి అవి ఎక్కడివని అడిగేవాడు. ఫ్రెండ్ ఇచ్చిందని అబద్ధం చెప్పేది. ఓ రోజు ఫ్రెండ్ ఆఫీసుకు పోగానే కదిరన్ అతడి ఇంట్లోకి వెళ్లాడు.
ఇంటి తలుపు దగ్గరకు మాత్రమే వేసి ఉంది. ఇంట్లో ప్రాజెక్ట్ ఫైల్ మర్చిపోయిన మునిస్వామి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రతి రోజు లాగే ఆరోజు కూడా కదిరన్, కరుణ గదిలో శృంగారం చేస్తూ ఉన్నారు. ఇంటి బయట ఫ్రెండ్ చెప్పులు కనిపించటంతో మునిస్వామి మనసు కీడు శంకించింది. చప్పుడు చేయకుండా తలుపుతీసి లోపలికి వెళ్లాడు. బెడ్‌రూం తలుపు తీసి చూశాడు. భార్య ఫ్రెండ్‌తో చూడకూడని స్థితిలో ఉండటం చూసి షాక్ అయ్యాడు. పట్టరాని కోపంతో ఫ్రెండ్‌ను చితక్కొట్టాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కోడలి శీలాన్ని అమ్మేసిన అత్త! ఇంత దారుణమా?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.