కొత్తవలసలోని జనం భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. వాళ్లు ఎప్పుడు? ఎలా? ఎటునుంచి దాడి చేస్తారో తెలియక అల్లాడిపోతున్నారు. మహిళ మరణంతో జనంలో భయం తారాస్థాయికి చేరిపోయింది.
ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలని వీరు టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఇంతకాలం రోడ్డుపై మాత్రమే చైన్ స్నాచింగ్స్ జరుగుతూ వచ్చాయి. కానీ.. దుర్మార్గులు ఇప్పుడు మరింత తెగిస్తున్నారు. మహిళలు ఒంటరిగా ఉండే ఇళ్ళని టార్గెట్ చేసుకుని, ఆ ఇళ్లలోకి వెళ్లి మరీ తమకి కావాల్సిన బంగారాన్ని లాక్కుంటున్నారు. ఈ క్రమంలో మహిళలపై అఘత్యానికి గాని, వారి ప్రాణాలను తీయడానికి గాని వీరు ఏ మాత్రం ఆలోచించడం లేదు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలసలో దారుణం చోటు చేసుకుంది. దొంగల దాడిలో ఒంటరిగా ఉన్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. కొత్త వలస వీధిలో నివాసముంటున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కారం చల్లి దాడి చేశారు. మాస్క్ కళ్ళద్దాలు, టోపి పెట్టుకుని వచ్చిన దుండగులు ఇంట్లోకి చొరబడి కారం చల్లారు. అనంతరం దుండగులు మహిళ ఒంటిపైనున్న బంగారం ఎత్తుకెళ్ళారు. దాడిలో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
నిజానికి కొత్తవలసలో కొన్నాళ్ళుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ విషయంలో స్థానిక నాయకులకు, పోలీస్ లకు ఎన్నిసార్లు ఫిర్యాదులు వెళ్లినా యంత్రాంగంలో చలనం రాలేదు. ఇక ఇప్పుడు.. ఏకంగా దొంగల దాడిలో మహిళ మృతి చెందడంతో కొత్తవలస ప్రజలు భయాందోళనుకు గురి అవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తుంది.