టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా అనేక మంది వెలుగులోకి వచ్చారు. తమ టాలెంట్ తో వీడియోలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తూ సినిమాల్లో సైతం అవకాశాలను అందుకుంటున్నారు. అయితే ఇలా తక్కువ సమయంలోనే వెలుగులోకి వచ్చిన వ్యక్తే ఉప్పల్ బాలు. టిక్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈయన సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తుంటాడు. ఇక ఆయనతో పాటు స్వాతి నాయుడు అనే యువతి కూడా తక్కువ సమయంలోనే అందరి దృష్టిలో పడి కాస్త ఫేమస్ అయింది.
ఇది కూడా చదవండి: Tina Sadhu: ఆట టైటిల్ విన్నర్ టీనా మృతిపై అనుమానాలు! సహజ మరణమేనా?
ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు హైదరాబాద్ కు చెందిన సతీష్ అనే యువకుడు. అశ్లీల, ప్రాంక్ వీడియోలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరాడు. ఇందులో భాగంగానే ఉప్పల్ బాలు , స్వాతి నాయుడు , ప్రాంక్ పోరీలు- దివ్య, 7 ఆర్ట్స్ శ్రీకాంత్ రెడ్డి వంటి వారిపై వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిర్యాదులో పేర్కొన్నాడు. ఇక వీరితో పాటుగా ఆశ్లీలతను ప్రమోట్ చేస్తూ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా యాప్స్ ఐన ఫేస్బుక్ , యూ ట్యూబ్ మొదలైన వాటిలో పోస్ట్ చేయడం వల్ల పిల్లలు చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక దీంతో పాటు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో ఇలాంటి వీడియోలు పెట్టే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో ఈ యువకుడి ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఉప్పల్ బాలు, స్వాతి నాయుడుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్ బాలు, స్వాతి నాయుడుపై కేసు నమోదవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.