ఃఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కాలుదించిన కొందరు వివాహిత మహిళలు పచ్చని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణ ఘటనే ఒకట హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జవహర్ నగర్ ప్రాంతంలో రాజమణి అనే మహిళ కొన్నాళ్లుగా నివాసముంటుంది. అయితే ఈ వివాహిత గత పది సంవత్సరాల నుంచి అశోక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.
ఇన్ని రోజులు నుంచి రాజమణి తెరచాటున సాగిస్తున్న ఈ వ్యవహారం చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేస్తూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలోనే రాజమణి మరో వ్యక్తితో కాస్త చనువుగా ఉన్నట్లు ప్రియుడు అశోక్ గమనించాడు. దీంతో ఇదే విషయాన్ని రాజమణితో అశోక్ ఓ రోజు నిలదీసి అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ తరుణంలోనే గత అయిదు రోజుల నుంచి రాజమణి కనిపించకుండా పోయింది.
కట్ చేస్తే.. ఇక ఆరు రోజుల తర్వాత పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా రాజమణి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు అశోక్ రాజమణిని హత్యచేసి శామీర్ పేట్ ప్రాంతంలోని ఓ చెట్ల పొదల్లో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇక వివాహాతర సంబంధం కారణంగా రాజమణి దారుణ హత్యకు గురి కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.