ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు సొంత కాపురాన్ని కాదని వివాహేతర సంబంధాల కోసం దారులు వెతుకుతున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ భర్త అందమైన భార్యను ఇంట్లో పెట్టుకుని పరాయి పడక సుఖం కోసం పాకులాడి చివరికి పచ్చని కాపురాన్ని నిట్ట నిలువునా చీల్చుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది బెంగుళూరులోని మండ్య జిల్లా మద్దూరులోని హోళె వీధి. ఇక్కడే అఖిల్ ఆహ్మద్, కౌసర్ (30) దంపతులు నివాసం ఉంటున్నారు. గతంలో వీరికి వివాహం జరిగింది. భర్త స్థానికంగా మెకానిక్ గా పని చేస్తుండగా.., భార్య మాత్రం ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. అలా కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు లేకుండా సంతోషంగా సాగుతూ వచ్చింది. ఇక కొన్నేళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఆ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ కొంత కాలం గడిచిన తర్వాత భర్త తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేశాడు. ఇంట్లో అందమైన భార్యను కాదని పరాయి సుఖం పాకులాడాడు. భర్త అఖిల్ ఆహ్మద్ స్థానికంగా ఉండే ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా ప్రియురాలితో తెగ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు. ఇదే విషయం కొన్నాళ్ల తర్వాత తన భార్యకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది.
దీంతో అనేక సార్లు భార్య కౌసర్ భర్తకు.. ఇలాంటి బుద్ది మార్చుకోవాలని తెలిపింది. కానీ భర్త ప్రవర్తనలో మార్పు మాత్రం రాలేదు. ఇక భర్త ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయిన భార్య.. భర్త చీకటి కాపురాన్ని కుటుంబ సభ్యుల ముందుకు తీసుకెళ్లి పెద్దలతో పంచాయితీ కూడా పెట్టించింది. దీంతో ఇక నుంచి భర్త మారతాడని భార్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ భర్తలో మార్పు రాకుండా తన ప్రియురాలితో తిరుగుతున్నాడు. దీనిని తట్టుకోలేని భార్య కౌసర్ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలాంటి బతుకు నాకొద్దు అనుకుని ఇటీవల పిల్లలకు విషిమిచ్చి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక స్థానికులు ఇంట్లోకి వచ్చి చూడగా.. ఇద్దరు పిల్లలు, కౌసర్ విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కౌసర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కూతురు మరణానికి కారణమైన భర్త అఖిల్ ఆహ్మద్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అఖిల్ ఆహ్మద్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.