ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శ్రీలత. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కట్ చేస్తే ఉన్నట్టుండి శ్రీలత ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు శ్రీలత, వయసు 25 ఏళ్లు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూతురిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఇక పెళ్లి వయసు రావడంతో ఓ వ్యక్తికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కన్నవారిని, ఉన్న ఊరిని కాదని శ్రీలత తల్లిదండ్రుల కోరిక మేరకు భర్తతో వెళ్లిపోయింది. ఇక పెళ్లైన కొంత కాలం పాటు భర్త బాగానే చూసుకున్నాడు. దీంతో వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అంతా బాగానే ఉందని కవిత తల్లిదండ్రులు మురిసిపోతున్న తరుణంలోనే ఊహించని వార్త వారి చెవిన పడింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కన్నెపల్లి మండలం జన్కాపురం గ్రామం. ఇక్కడే దర్వాజల లచ్చన్న-భాగ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీలత (25) అనే కూతురు ఉంది. పెళ్లి వయసు రావడంతో ఆమె తల్లిదండ్రులు తాండూర్ చెందిన మహేందర్ అనే యువకుడితో 2021లో వివాహం జరిపించారు. దీంతో శ్రీలత కన్నవారిని, ఉన్నఊరిని విడిచి భర్తతో వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచింది. శ్రీలత-మహేందర్ దంపతుల వైవాహిక జీవితం కొంత కాలం పాటు బాగానే సాగింది.
అయితే ఇన్ని రోజులు అయినా కోడలికి పిల్లలు కలగలేదని అత్తింటి వాళ్లు తరుచు ఆమెను వేధింపులకు గురి చేసేవారట. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలంటూ భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా నరకం చూపించినట్లు సమాచారం. ఇక జరిగిందతా శ్రీలత తల్లిదండ్రులకు చెప్పి బాధపడుతూ ఉండేది. కట్ చేస్తే ఇటీవల తాండూరు పరిధిలోని ఓ రైల్వే ట్రాక్ పై శ్రీలత శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీలత తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత శ్రీలత మృతదేహాన్ని పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలం నుంచి మా కూతురుని.. పిల్లలు కలగలేదని, అదనపు కట్నం వంటి కారణాలతో తరుచు వేధించారని, ఈ క్రమంలోనే భర్త, అత్తింటివాళ్లు కలిసి శ్రీలతను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.