తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశం అంతటా మహిళలపై కామంథలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపించిన మహిళలలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు బలమైన చట్టాలు ఎన్ని తెచ్చినా దుర్మార్గుల తీరు మాత్రం మారటం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికంగా నంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటోంది 16 ఏళ్ల బాలిక . ఇక అదే గ్రామానికి చెందిన పగిళ్ల సందీప్ అనే యువకుడు ఎన్నో రోజుల నుంచి ఆ బాలికపై కన్నేశాడు. తాజాగా ఆ గ్రామంలో ఉత్సవం జరిగింది. దీంతో ఆ బాలిక బయటకు రావటాన్ని గమనించిన సందీప్ ఎలాగైన ఎత్తుకెళ్లాలని భావించాడు. అనుకున్నట్లే పథకం ప్రకారం ఆ బాలికను స్థానిక పాఠశాలలోకి లాక్కెళ్లాడు. దీంతో ఆ బాలికపై దాడికి దిగి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక బాలిక అమ్మమ్మ ఇంత సేపు ఎక్కడికి వెళ్లావని బాలికను మందలించగా అసలు విషయం పూసగుచ్చినట్లుగా వివరించింది. ఇక ఆ బాలికను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.