ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది వాట్సాప్ అవతార్, కమ్యూనిటీ, స్టేటస్, రియాక్షన్ వంటి అనేక కొత్త ఫీచర్‌లు తీసుకొచ్చిన వాట్సాప్, కొత్త ఏడాదిలో యూజర్ ఫ్రెండ్లీ అప్ డేట్స్ తీసుకొచ్చింది. ఇవి వాట్సాప్ లో ఇంతకుముందున్న ఫీచర్లకు షార్ట్ కట్స్ అని చెప్పాలి.
వాట్సాప్లో అన్ నోన్ కాంటాక్ట్స్ తో ఇబ్బంది పడేవారి సంఖ్య కోకొల్లలు. స్పామ్ మెసేజులతో విసిగించే వారు కొందరైతే.. అసభ్యంగా వేధించే ఆకతాయిలు మరికొందరు. పోనీ, ఆయా నంబర్లను వెంటనే బ్లాక్ చేద్దామా అంటే.. వాట్సాప్ లోకి వెళ్లి, సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ ఫీచర్ ఎంచుకొని కాంటాక్ట్ బ్లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ కొత్తగా తీసుకొచ్చిన అప్ డేట్ తో కాంటాక్ట్ బ్లాకింగ్ ప్రాసెస్ ఈజీ అయింది. అన్ నోన్ కాంటాక్ట్స్ నుంచి మెసేజ్, కాల్స్ వస్తే నోటిఫికేషన్ పాప్అప్ లోనే ‘బ్లాక్ దిస్ కాంటాక్ట్’ అని చూపిస్తుంది. దీంతో హోమ్ స్క్రీన్ నుంచే అన్ నోన్ నంబర్లను బ్లాక్ చేయొచ్చు.
ఇంతకుముందు వాట్సాప్ కెమెరాతో ఫొటో తీస్తున్నపుడు ఫొటో మోడ్ నుంచి వీడియో మోడ్ కి స్విచ్ కాలేము. కానీ, రీసెంట్ అప్ డేట్ లో ఫొటో నుంచి వీడియో మోడ్ కి ఈజీగా స్విచ్ కావచ్చు. కెమెరా బటన్ కింద కనిపించే ఫొటో, వీడియో మోడ్స్ ఉపయోగించి కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవాలి.
📝 WhatsApp beta for iOS 23.1.0.75: what’s new?
WhatsApp is working on a camera mode for quickly recording videos, for a future update of the app!https://t.co/5IQq8eNqZY
— WABetaInfo (@WABetaInfo) January 15, 2023