అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ఉదయం 7:30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1929.44 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ 14 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అంటే ఉదయం 7:30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1915.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశీయంగా కూడా బంగారం ధర తగ్గింది. గత వారం వరుసగా 5 రోజుల పాటు తగ్గుతూ వచ్చిన గోల్డ్.. ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగింది. అయితే అమెరికా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో గ్లోబల్ గా స్పాట్ గోల్డ్ పై డిమాండ్ తగ్గింది. దీంతో బంగారం ధర తగ్గింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,350 ఉండగా.. ఇవాళ స్థిరంగా ఉంది.
దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ. 54,350 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 59,280 వద్ద కొనసాగగా ఇవాళ రూ. 100 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 59,180 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర ఐతే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఉదయం 7:30 గంటలకు ఔన్సు స్పాట్ వెండి 22.95 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ 22.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో మాత్రం వెండి ధర పెరిగింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 75,200 వద్ద కొనసాగగా.. ఇవాళ రూ. 500 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 75,700 వద్ద కొనసాగుతోంది.