పసిడి ప్రియులకు గుడ్న్యూస్..! దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఇక వెండి విషయానికొస్తే ఒక్క రోజే భారీగా పడిపోయింది. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
మనదేశంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ ఉంటుంది. బంగారం ఇంటికి తెచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. ఏ శుభకార్యాలు అయినా సరే బంగారం కొంటారు. ఇంట్లో ఉన్న బంగారాన్ని అలంకరించుకుంటారు. సామాన్యులు సైతం ఎంతో కొంత బంగారం పోగు చేస్తుంటారు. మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రీతి. ఎన్ని నగలు ఉన్నాకూడా మరోటి కొనడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచం మొత్తంలో టన్నుల కొద్ది బంగారం భారత దేశంలోనే ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. అయితే గత రెండు నెలల నుండి ముహూర్తాలు లేక బంగారానికి కొంచెం డిమాండ్ తగ్గింది. మరో వారం రోజుల తర్వాత శ్రావణ మాసం మొదలవుతుంది. దీంతో అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి.
దీంతో బంగారం, వెండి కొనుగోళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ఒకేసారి రూ.1000 కు పతనమైంది. తాజాగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ పడిపోతుంది. ఇవాళ ఔన్స్ బంగారం ధర దాదాపు 8 డాలర్లకు తగ్గింది. ఇప్పుడు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1925 డాలర్ల వద్ద కొనసాడుతోంది. వెండి రేటులో సైతం పతనమైంది. ఈ రోజు స్పాట్ సిల్వర్ రేటు 22.77 వద్ద ట్రేడవుతోంది. మన హైదరాబాద్లో చూస్తే బంగారం ధర ఈ రోజు స్వల్పంగా దిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 తగ్గింది. ప్రస్తుతం రూ. 55,050 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 100 తగ్గింది. ప్రస్తుతం రూ. రూ.60,060 వద్ద ట్రేడవుతోంది.
ఇటీవల రికార్డ్ స్థాయిలో ట్రేడైన గోల్డ్ ధర మళ్లీ దిగివస్తుంది. దేశీయ మార్కెట్లో వెండి రేటు కుప్పకూలింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1000 పడిపోయింది. గత రెండు రోజుల్లో కిలో వెండికి రూ.1200 కు పడిపోయింది. ప్రస్తుతం వెండి కిలో రూ.77,300కు పతనమైంది. స్వల్పంగా బంగారం రేటు దిగింది. వెండి కూడా వరుసగా దిగిరావడం బంగారం కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం. బంగారం, వెండి ధరలు వరుసగా దిగిరావడం పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో పెరిగిన ధరలు దిగడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు సూచనలు. దీని కారణంగా డాలర్ పుంజుకుంటోంది. పెట్టుబడులు బాండ్ ఈల్డ్స్ వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం, వెండి వంటి విలువైన ఖనిజాల ధరలపై ఒత్తిడి పడి ధరలు పతనమవుతున్నాయి. ఏది ఏమైనా బంగారం కొనుగోలుదారులకు ఇది శుభ పరిణామమనే చెప్పాలి.