మనిషి ఆశా జీవి. ఎంత అంటే.. ముందు తినడానికి తిండి, ఉండటానికి గూడు.. కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలనుకుంటాడు. ఇవి సమకూరితే తృప్తి ఉంటుందా.. ఉండదు. ఇంతకంటే బెటర్ లైఫ్ కావాలని ఆలోచిస్తాడు. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా.. డబ్బు సంపదానకే. ప్రతి మనిషి జీవితంలో కోటీశ్వరులు కావాలని ఆశిస్తారు. అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తారు. కానీ కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. ఇక మీరు కూడా జీవితంలో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా.. కేవలం సేవింగ్స్ ద్వారానే.. కోటీశ్వరులు కావాలని కోరుకుంటే.. ఈ వార్త చదవండి.
ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేస్తూ.. దీర్ఘకాలంలో మంచి రాబాడి పొందాలనుకునేవారికి ఎంతో ఉత్తమైన మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.. సిప్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో భారీ మొత్తం వెనకేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని తెలియజేస్తున్నారు. మీకు 25 ఏళ్ల వయసు ఉంటే.. 45 ఏళ్ల వయసు వచ్చేసరికి కోటీశ్వరులు అవ్వడం ఎలానో ఒకసారి తెలుసుకుందాం.
ప్రతి నెలా 10 వేల రూపాయలు సిప్ చేస్తే..
మీరు ప్రతి నెలా 10 వేల రూపాయలు పొదుపు చేస్తూ.. ఓ 20 ఏళ్ల తర్వాత కోటి రూపాయలు పొందాలంటే మీరు మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములాను అనుసరించాలి. దీర్ఘకాలంలో చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ సగటున 12 శాతం రాడిబడిని అందించాయి. అంటే సాంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లతో పోలిస్తే ఎక్కువ రాబడి వస్తోందని చెప్పుకోవచ్చు. మీరు నెలకు రూ. 10 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే.. 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. వచ్చే 20 ఏళ్లలో మీరు రూ. కోటి పొందొచ్చు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 24 లక్షలు అవుతుంది. కానీ 20 ఏళ్ల తర్వాత మీకు వచ్చే రాబడి మాత్రం రూ. 75 లక్షలకు పైగానే ఉంటుంది
సిప్ చేయడం వల్ల ప్రయోజనాలు..
సిప్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గమనిస్తే.. ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు పెట్టాల్సిన పని లేదు. ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలంలో డబ్బులు పెట్టడం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తుంది. దీని వల్ల భారీ మొత్తం పొందే ఛాన్స్ ఉంటుంది. మీరు నెలకు రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. మీరు ప్రతి నెలా డిపాజిట్ చేసే మొత్తం, వచ్చే రాబడి ప్రకారం మీకు మెచ్యూరిటీ సమయంలో లభించే డబ్బులు కూడా మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుందని గుర్తించుకోవాలి. అయితే ఈక్విటీ మార్కెట్‌లో ఉన్నంత అయితే ఉండదు. అంతేకాకుండా మీరు సిప్ చేయడం వల్ల దీర్ఘకాలంలో రిస్క్ అనేది తగ్గుతుంది. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సిప్ మంచి ఆప్షన్ అనేది చాలా మంది నిపుణుల మాట. అదే మీరు ప్రతి నెలా సిప్ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని పెంచుకుంటూపోతే దీర్ఘకాలంలో మరింత లాభం పొందొచ్చు. సంపద సృష్టికి సిప్ అనేది మంచి ఆప్షన్ అని గుర్తు పెట్టుకోవాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజయేండి.