ప్రస్తుతం ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుండటంతో ఎంత డబ్బు సంపాదించినా పొదుపు చేయడం కష్టంగా మారుతుంది. అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి మంచి ఆదాయాన్ని అర్జించడం అంత సులువు కాదు. అయితే ప్రభుత్వం, అలానే వివిధ బ్యాంకులు అందించే స్కీమ్స్ లో పెడుబడి పెడితే.. మంచి ఆదాయం పొందవచ్చు. ఎబ్బీఐలోని ఓ పథకంలో పెటుబడిపెడితే రూ.21 లక్షలు మీవే అవుతాయి.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుండటంతో ఎంత డబ్బు సంపాదించినా పొదుపు చేయడం కష్టంగా మారుతుంది. అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి మంచి ఆదాయాన్ని అర్జించడం అంత సులువు కాదు. అయితే ప్రభుత్వం, అలానే వివిధ బ్యాంకులు అందించే స్కీమ్స్ లో పెడుబడి పెడితే.. మంచి ఆదాయం పొందవచ్చు. అలానే మన డబ్బులు భరోసా అనేది ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందించే పథకం ఎస్బీఐ బ్యాంకులో ఒకటి ఉంది. అందులో పెట్టుబడి పెడితే రూ.21 లక్షలు పొంద వచ్చు. మరి.. ఆ పథకం ఏమిటి? దాని పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ఈ బ్యాంకు తన కస్టమర్లకు అనేక రకల సేవలు అందిస్తోంది. అలానే వివిధ రకాల సర్వీసులు, స్కీమ్స్ అందిస్తో బ్యాంకింగ్ రంగంలోనే ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఈ బ్యాంకులో మంచి లాభాలు ఇచ్చే స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఈ పథకాల్లో చేరడం వల్ల అదిరే లాభాలు పొందొచ్చు. అలానే వీటిల్లో చేరితే ఒకేసారి భారీ మొత్తంగా పొందొచ్చు. అయితే వీటి కోసం దీర్ఘకాలం వరకు వేచి ఉండాలి. అప్పుడే మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇక ఎస్బీఐ వెబ్ సైట్ లో ఇచ్చిన వివరాల ప్రకారం చూస్తే.. సీనియర్ సిటిజన్స్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు ఎఫ్‌డీ చేయొచ్చు. సాధారణంగా వీరికి సాధారణ వినియోగదారుల కన్నా 0.5 శాతం మేర అధిక వడ్డీ లభిస్తుంది. అలానే 5-10 ఏళ్ల ఫిక్స్ డిపాజిట్లపై 1 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. ఎస్బీఐ నిబందనల ప్రకారం ఐదేళ్ల నుంచి పదేళ్ల ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్స్‌కు మాత్రం బ్యాంక్ 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు ” ఉయ్ కేర్ డిపాజిట్” పథకం కింద అయితే 0.5 శాతం అధిక వడ్డీ ఎస్బీఐ అందిస్తుంది.
ఎస్బీఐ డిపాజిట్ స్కీమ్ లో ఒకేసారి రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 21 లక్షలకు పైగా చేతికి వస్తాయి. ఇక్కడ పదేళ్ల టెన్యూర్ ఎంచుకోవాలి. అలాగే వడ్డీ రేటు 7.5 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. ఆ విధంగా చూస్తే వడ్డీ రూపంలో ఇన్వెస్టర్లకు ఏకంగా రూ.11 లక్షలకు పైగా లాభం పొందవచ్చు. ఇక్కడ మీరు ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే.. అంత ఎక్కువ రాబడి వస్తుంది. అందువల్ల మీ ఆదాయం అనేది మీ పెట్టుబడి, టెన్యూర్ ప్రాతిపదికన మారుతుందని గుర్తించుకోవాలి. అందుకే అధిక వడ్డీ వచ్చే ఎక్కువ టెన్యూర్ ఎంచుకోవాలి. మరి.. ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.