మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. మంచి పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది తీసుకుంటే మీరు తక్కువ ప్రీమియంకే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఆరోగ్య పాలసీలు తీసుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అలాంటి తక్కువ ఖర్చులో గ్రామీణులకు అందుబాటులో ఉన్న పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ సమాచారాన్ని మీకందిస్తున్నాం. ఇందులో రోజుకు కేవలం రూ.95 చెల్లింపుతో ఏకంగా రూ.14 లక్షలను పొందవచ్చు. ఈ పాలసీ ఏంటి..? దీని ప్రయోజనాలేంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టాఫీస్ లో ప్రధానంగా 6 రకాల ఇన్సూరెన్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రామ్ సుమంగల్ స్కీమ్ ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు. గరిష్టంగా రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. వయస్సు 19 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకంలో పాలసీదారుకు మెచ్యూరిటీపై బోనస్ కూడా ఇవ్వబడుతుంది. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలవ్యవధితో ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మెచ్యూరిటీ గడువు ముగియకముందే పాలసీదారుడు మరణిస్తే.. పాలసీ డబ్బులు నామినీకి అందిస్తారు.
ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సున్న వ్యక్తి పాలసీ హామీ మెుత్తం 7 లక్ల రూపాయలతో 20 ఏళ్ల కాలానికై పాలసీ తీసుకుంటే రూ.14 లక్షలు పొందుతాడు. అందుకుగాను అతడు నెలకు రూ.2,853 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు సుమారు రూ.95 అన్నమాట. ఈ మెుత్తంలో 60 శాతం డబ్బు మనీ బ్యాక్ రూపంలో ఇవ్వబడుతుంది. ఇంటి పెద్ద దూరమైతే.. ఆ ఇంటిని చుట్టుముట్టే ఆర్థిక కష్టాలు గురించి చెప్పక్కర్లేదు. పిల్లల పైచదువులు, ఇంటి అవసరాలు, రోజు గడవటం.. ఇలా అన్నింటా డబ్బుతోనే అవసరముంటుంది. ఇష్టం లేకపోయినా.. ఈ పాలసీ తీసుకోవడం ఒకందుకు మంచిదే. ఈ పాలసీ గురుంచి మరింత సమాచారం కోసం.. మీ దగ్గరలోని పోస్టాఫీస్ సిబ్బందిని సంప్రదించండి.