‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్‌తో పాపులర్ అయిన వ్యాపారవేత్త ‘లలితా జ్యువెల్లరీ’ ఎండీ కిరణ్ కుమార్. ఈయన గురించి తెలియని తెలుగు వారు ఉండరు. అంతలా ఈ ఒక్క డైలాగ్‌తో ఆయన సెలబ్రిటీ అయిపోయారు. తన బంగారు ఆభరణాల వ్యాపారంతో పాటు ఆయన కూడా ఒక్కసారిగా ఎదిగిపోయారు. పెద్ద పెద్ద హీరోలని, హీరోయిన్లని పెట్టి వ్యాపారాన్ని ప్రమోట్ చేయకుండా కొత్తగా ఆలోచించి.. ముఖానికి రంగు వేసుకుని కెమెరా ముందు నిలబడ్డారు. ఈరోజు అతి పెద్ద బంగారు నగల వ్యాపారిగా ఎదిగారు. అతి సాధారణ స్థాయి నుండి ఎన్నో కష్టాలు పడి ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుండి ఇప్పుడు ఏ లోటూ లేదు అనే స్థితికి వచ్చారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకున్న ప్రత్యేక లక్షణం.
తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఎందుకు ఎప్పుడూ మీరు గుండుతోనే కనబడతారు అన్న ప్రశ్నకి ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “ఒకప్పుడు నాకు జుట్టు బాగా ఒత్తుగా ఉండేది. మంచి హెయిర్ ఉండేది. 8 ఏళ్ళ క్రితం తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చాను. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు.. మీకు గుండు బాగా సెట్ అయ్యింది సార్, భలే బాగుంది సార్ అని అన్నారు. తల మీద జుట్టు ఉన్నప్పుడు ఒక్కడూ బాగుందని అనలేదు. కానీ గుండుతో కనిపిస్తే మాత్రం అందరూ బాగుందని అన్నారు. దీంతో బాగుందంటున్నారని ఇదే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇక ఆరోజు నుండి గుండునే మెయిన్‌టెయిన్ చేస్తూ వచ్చాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక మీ లలితా జ్యువెల్లరీకి మీరే ఎందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు అన్న ప్రశ్నకు.. ఆయన కస్టమర్స్‌ని దోచుకోవడం ఇష్టం లేదని సమాధానమిచ్చారు. “ఒక పెద్ద హీరోని పెట్టి ప్రమోట్ చేస్తే బిజినెస్ బాగుంటుంది. ఐతే ఆ హీరోకి పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడి కస్టమర్స్ నుండే వసూలు చేయాలి. కస్టమర్ మీద ఎందుకు భారం వేయడం అని ఆలోచించి హీరోలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. నేనే బిజినెస్‌ని ఫ్రీగా ప్రమోట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. దీని వల్ల కస్టమర్ మీద భారం అనేది పడదు” అని చెప్పుకొచ్చారు. మరి అతి సాధారణ స్థాయి ఉండి అసాధారణ స్థాయికి ఎదిగినప్పటికీ.. సింప్లిసిటీని మెయిన్‌టెయిన్ చేస్తున్న కిరణ్ కుమార్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.