గ్రాము బంగారం కొనాలంటే సామాన్య జనాలు రూ. 10 వేలు దాచుకోవాల్సిందేనా? తులం బంగారం కొనాలంటే రూ. లక్ష తెచ్చుకోవాల్సిందేనా? భవిష్యత్తులో బంగారం ఎలా ఉండబోతోంది? పది గ్రాముల వద్ద 60 వేలకు అటూ ఇటూ ఊగిసలాడుతున్న బంగారం మును ముందు కొండెక్కి కూర్చోనుందా?
గ్రాము బంగారం కొనాలంటే రూ. 10 వేలు అవుతుందా? 10 గ్రాములు కొనాలంటే లక్ష రూపాయలు చూసుకోవాల్సిందేనా? రిచ్ కిడ్స్ 100 గ్రాములకు రూ. 10 లక్షలు, కిలో బంగారానికి రూ. కోటి రూపాయలు సమర్పించాల్సిందేనా? బంగారం ఇంతలా పెరుగుతుందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ బంగారు నగల వ్యాపారి, లలితా జ్యువెలరీ ఎండీ కిరణ్ కుమార్. బంగారం ఈ విధంగా పెరగడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. బంగారానికి డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ తగ్గినా కూడా మునుపటి కంటే ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తగ్గినా కూడా పెద్దగా ఏమీ అనిపించదు. పెట్రోల్, డీజిల్ రూపాయల్లో పెరిగి.. పైసల్లో తగ్గితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చూస్తున్నాం. కానీ మరీ రూ. లక్ష రూపాయలకు పెరిగే అవకాశం ఉందా అంటే ఉందనే అంటున్నారు లలితా జువెల్లరీ ఎండీ కిరణ్ కుమార్. బంగారం తగ్గినా 5, 10 శాతం తగ్గుతుందని, మళ్ళీ 20 శాతం పెరుగుతుందని, కాబట్టి ఇక్కడ బంగారం విషయంలో ఎప్పుడూ 10 శాతం పెరుగుదల అయితే కొనసాగుతోందని అన్నారు. కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో కిలో బంగారం రూ. 39 లక్షల నుంచి రూ. 40 లక్షలు ఉందని, ఆ తర్వాత రూ. 69 లక్షలకు వెళ్లిపోయిందని అన్నారు. ఈరోజు కూడా రూ. 67 లక్షల నుంచి 68 లక్షలు ఉందని అన్నారు. ఈ లెక్కన బంగారం విషయంలో 20 శాతం పెరుగుదల కనబడుతోందని, బంగారం అనేది భవిష్యత్తులో అంటే దీర్ఘకాలంలో చూస్తే గ్రాము బంగారం ధర రూ. 10 వేలు అయిపోతుందని అన్నారు.
10 వేలు ఇస్తే గ్రాము బంగారం ఇచ్చే రోజులు వస్తాయని, కిలో బంగారం కోటి రూపాయలు అయిపోతుందని అన్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుందని అన్నారు. గడిచిన రెండు, మూడేళ్ళలో చూసుకుంటే కిలో బంగారం రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల దగ్గరకు వచ్చేసింది. కోటి రూపాయలకు రూ. 40 లక్షలే కదా పెరగాలి. అది కూడా పెరుగుతుంది, నెమ్మదిగా పెరుగుతుంది. నూరు శాతం పెరుగుతుందని, కాకపోతే సమయం పడుతుందని అన్నారు. ఇది యాదృచ్చికమో మరేంటో తెలియదు గానీ ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒకవేళ లాక్ డౌన్ పెట్టే పరిస్థితి వస్తే కిరణ్ కుమార్ చెప్పినట్టు ఆ పెరుగుదల కనబడే సూచనలు కనబడుతున్నాయి.
గతంలో లాక్ డౌన్ పీరియడ్ తర్వాత బంగారం 20 శాతం పెరిగిందని అన్నారు. అంటే రెండు, మూడేళ్ళలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరనుందా? ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ. 6,115 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల బంగారం రూ. 61,150. ఏడాది క్రితం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 53 వేలు ఉండేది. 6 నెలల క్రితం రూ. 56 వేలు ఉండేది. 3 నెలల క్రితం రూ. 58 వేలు అయ్యింది. నెల రోజుల క్రితం రూ. 60 వేలు అయ్యింది. ఒక్క ఏడాదిలో దాదాపు 8 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలు పెరుగుదల కనబడింది. ఈ లెక్కన రెండు, మూడేళ్ళలో 20 వేల నుంచి 30 వేల వ్యత్యాసం అనేది కనబడే అవకాశం ఉంది. అంటే అప్పుడు 10 గ్రాముల బంగారం 90 వేల నుంచి లక్షకు చేరిపోతుంది. కిలో బంగారం కోటి రూపాయలు అయిపోతుంది. కిరణ్ కుమార్ చెప్పినట్టు బంగారం విషయంలో ఈ పెరుగుదల రెండు, మూడేళ్ళలో కనబడే అవకాశం కనబడనుందా? అంతకంటే ముందే ఈ భారీ పెరుగుదల కనబడనుందా? మరి గ్రాము 10 వేలు, పది గ్రాములు లక్ష అయిపోతే సామాన్యుడు కొనే పరిస్థితి ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.