సాధారణంగా మార్కెట్ లో పేరున్న కంపెనీలు ఎక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసినా సినీ సెలబ్రిటీలను లేదా స్థానికంగా రాజకీయాలలో యాక్టీవ్ గా ఉన్న నాయకులను ఆహ్వానిస్తుంటారు. గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతోనే షోరూమ్ లేదా కొత్త షాప్ లను రిబ్బన్ కట్ చేయిస్తుంటారు. ఎలాంటి బిజినెస్ అయినా.. ఎవరిచేనైతే కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేయాలని భావిస్తారో.. ఆ సెలబ్రిటీలే వచ్చి ఓపెన్ చేస్తే కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని కేవలం ఆ షాప్ ఓనర్ మాత్రమే పొందగలడు. ప్రస్తుతం లలితా జ్యువలరీ ఓనర్ కిరణ్ కుమార్ ఆ ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు.
దేశవ్యాప్తంగా పాపులర్ అయిన లలితా జ్యువలరీ నుండి.. చిత్తూరు జిల్లాలో కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది. లలితా జ్యువలరీ అనగానే అందరికీ ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అనే డైలాగ్ చెప్పే వ్యక్తి గుర్తుకు వస్తాడు. దాదాపు ఇరవై ఏళ్లకు పైగా జ్యువలరీ బిజినెస్ చేస్తున్న ఓనర్ కిరణ్.. ఇప్పటిదాకా 45 బ్రాంచీలను ఓపెన్ చేసి.. జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడదే వ్యక్తి తాజాగా చిత్తూరులో 46వ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కోసం సినీ నటి, మంత్రి రోజాని ఆహ్వానించాడు. అతని ఆహ్వానాన్ని మన్నించి మంత్రి రోజా చిత్తూరులో లలితా జ్యువలరీ కొత్త బ్రాంచ్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ క్రమంలో పిలవగానే వచ్చి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసిన మంత్రి రోజాపై ప్రశంసలు కురిపిస్తూ ధన్యవాదాలు తెలిపాడు ఓనర్ కిరణ్. ఆయన మాట్లాడుతూ.. “పిలవగానే వచ్చినందుకు రోజా గారికి థ్యాంక్స్. రీసెంట్ గా మా టీంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి ఓపెనింగ్ కి రావాలని పిలిచాం. వెళ్ళగానే ఎంతో ఆప్యాయంగా పలకరించి, భోజనం పెట్టి మరీ మాకు మర్యాదలు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అది రోజా గొప్పతనం. మనం అనుకున్న గెస్ట్ వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది” అంటూ రోజాని కొనియాడాడు. అనంతరం రోజా కూడా లలితా జ్యువలరీస్ తో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం రోజాపై ప్రశంసిస్తూ లలితా జ్యువలరీ ఓనర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.