ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న ‘రిలయన్స్ జియో’ మరో రెండు వినూత్న ప్లాన్లను లాంచ్ చేసింది. 24 రోజులు, 28 రోజులు, 56 రోజులు అనే ప్లాన్లకు భిన్నంగా నెల, మూడు నెలల కాల వ్యవధితో ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి తక్కువ ధరలోనే గరిష్ట వ్యాలిడిటీ, గరిష్ట డేటా ప్రయోజనాలు అందిస్తున్నాయి. రూ.349, రూ.899.. ధరలలో తీసుకొచ్చిన ఈ ప్లాన్స్ కస్టమర్లకు ఉపయోగకరమే అని చెప్పొచ్చు.ఈ ప్లాన్స్ ప్రయోజనాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
రూ.349 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అంటే.. నెల వాలిడిటీ. ఇందులో ప్రతిరోజూ 2.5 జీబీ డేటా చొప్పున నెలకు 75 జీబీ డేటాను పొందుతారు. అలాగే, 30 రౌజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం, రోజుకు100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ సేవలు ఉచితం.
రూ.899 ప్లాన్: ఈ ప్లాన్ ప్రత్యేకత 90 రోజుల వ్యాలిడిటీ. అంటే.. మూడు నెలలు. ఇందులో ప్రతిరోజూ 2.5 జీబీ డేటా చొప్పున 90 రోజులకు 225 జీబీ డేటాను పొందుతారు. అలాగే, అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ఈ వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలను ఉచితంగా పొందవచ్చు.
ప్రస్తుతానికి ఏ టెలికాం నెట్ వర్క్ చూసినా.. 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల ప్లాన్స్ ఎక్కువుగా ఉన్నాయి. ఇలాంటి వాటితో రాబోయే రీఛార్జ్ ఎప్పుడన్నది కొంచెం అంచనావేయడం కష్టం. అదే నెల, మూడు నెలల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్లతో అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగకారమేనా..? మీ అభిప్రాయం ఏమిటో.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.