బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. మరి కొద్ది రోజుల్లో శుభకార్యాలకు అనువైన రోజులు రానున్న వేళ గోల్డ్ రేట్స్ తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశమే.
బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. మరి కొద్ది రోజుల్లో శుభకార్యాలకు అనువైన రోజులు రానున్న వేళ గోల్డ్ రేట్స్ తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశమే. కొద్ది రోజుల్లో పెళ్లిళ్లకి మంచి ముహూర్తాలు రానుండడంతో పలు కుటుంబాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. బంగారానికి ఎంత డిమాండ్ ఉన్నా కొనేందుకు మాత్రం వెనకాడరు పసిడి ప్రియులు. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. కాగా ఈ రోజు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఎంత తగ్గాయి అంటే? ఆ వివరాలు మీకోసం..
హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న 54,550 ఉండగా రూ.100 తగ్గి రూ. 54,450 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి రేటు నిన్న రూ. 59510 ఉండగా రూ. 110 తగ్గి రూ. 59,400 కి చేరింది. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ. 54,600, అదేవిధంగా 24 క్యారెట్ల ధర రూ. 59,550గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 200 పెరిగి.. రూ. 76,200 వద్ద కొనసాగుతోంది.
ఆగస్టు 16న 22 క్యారెట్ల బంగారం ధరలు:
1 గ్రాము: ₹ 5,445 ( ₹ 0 )
8 గ్రాములు: ₹ 43,560 ( ₹ 0 )
10 గ్రాములు: ₹ 54,450 ( ₹ 0 )
100 గ్రాములు: ₹ 5,44,500 ( ₹ 0 )
ఆగస్టు 16న 24 క్యారెట్ల బంగారం ధరలు:
1 గ్రాము: ₹ 5,940 ( ₹ 0 )
8 గ్రాములు: ₹ 47,520 ( ₹ 0 )
10 గ్రాములు: ₹ 59,400 ( ₹ 0 )
100 గ్రాములు: ₹ 5,94,000 ( ₹ 0)
ఆగస్టు 16న వెండి ధరలు:
1 గ్రాము: ₹76.20
8 గ్రాములు: ₹ 609.60
10 గ్రాములు: ₹ 762
100 గ్రాములు: ₹ 7,620
1000 గ్రాములు: ₹ 76,200