పసిడి ప్రియులకు శుభవార్త. గోల్డ్ ధరలు మళ్లీ పడిపోయాయి. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండ ధరలు ఎంత ఉన్నాయంటే?
భారతదేశంలో బంగారానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఏ చిన్న శుభకార్యమైన బంగారం కొనేస్తారు. పెళ్లిల్లు, పుట్టిన రోజులకు, ఫంక్షన్లకు వారి ప్రియమైన వారికి గిఫ్టుగా ఇవ్వడానికి ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. మార్కెట్లో కొత్తగా వచ్చిన ఆభరణాల డిజైన్లను కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా మొగ్గుచూపుతారు. దీంతో తరచుగా బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. మనదేశంలో బంగారం పై పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. అయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లొ నిన్న 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 55,600 ఉండగా రూ. 100 తగ్గి రూ. 55,500 వద్ద కొనసాగుతుంది. నిన్న 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 60,680 ఉండగా ఈ రోజు రూ. 130 తగ్గి రూ.60,550 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం స్పాట్ బంగారం రేటు ఔన్సు కు 1961 డాలర్లు పలుకుతోంది. నిన్నటి రోజున కిలో వెండి రూ. 2000 పెరిగింది. ఈ రోజు దీనికి కొనసాగింపుగా రూ. 100 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 79,800 మార్క్ వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లోని హెచ్చుతగ్గులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ రోజు తగ్గిన బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని పసిడి ప్రియులు బంగారం కొనుగోలు చేయవచ్చును.
జూన్ 10న 22 క్యారెట్ల బంగారం ధరలు:
1 గ్రాము: ₹ 5,550
8 గ్రాములు: ₹ 44,400
10 గ్రాములు: ₹ 55,500
100 గ్రాములు: ₹ 5,55,000
జూన్ 10న 24 క్యారెట్ల బంగారం ధరలు:
1 గ్రాము: ₹ 6,055
8 గ్రాములు: ₹ 48,440
10 గ్రాములు: ₹ 60,550
100 గ్రాములు: ₹ 6,05,500
జూన్ 10న వెండి ధరలు:
1 గ్రాము: ₹ 79.80
8 గ్రాములు: ₹ 638.40
10 గ్రాములు: ₹ 798
100 గ్రాములు: ₹ 7,980
1000 గ్రాములు: ₹ 79,800