అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధర పెరగడంతో.. దేశంలో దీని ధర ఊరట కలిగిస్తుంది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల నేపథ్యంతో బంగారం, వెండి ధరలకు డిమాండ్ పెరిగింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు, అమెరికా రుణ పరిమితి పెంపుపై ఒప్పందం వంటి కారణాలతో క్రితం సెషన్లో ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి
బంగారు ఆభరణాలను కొనాలనుకుంటున్నారా? అయితే ఇది అద్భుత అవకాశమనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల రికార్డు స్థాయికి గోల్డ్ ధరలు పెరుగుతూ వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధర పెరగడంతో.. దేశంలో దీని ధర ఊరట కలిగిస్తుంది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల నేపథ్యంతో బంగారం, వెండి ధరలకు డిమాండ్ పెరిగింది. ఆ సమయంలో కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. దీంతో ధరలు గరిష్టంగా ఉన్న సమయంలోనే బంగారాన్ని కొనుగోలు చేశారు సామాన్యులు. అయితే ఇప్పుడు వాటి ధరలు తగ్గు ముఖం పడుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు, అమెరికా రుణ పరిమితి పెంపుపై ఒప్పందం వంటి కారణాలతో క్రితం సెషన్లో ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. దేశీయంగా కూడా వీటి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో పుత్తడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1955.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వ ధర ఔన్సుకు మరింత పడిపోయింది. ప్రస్తుతం 23.13 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం రూ.82.778 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో బంగారం ధరలు ఎంత తగ్గాయో.. ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 120 తగ్గి.. రూ.60,630 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.55, 600 వద్ద ఉంది. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.400 తగ్గి ప్రస్తుతం రూ.72,600 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే..?
హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం ధర రూ. 110తగ్గి.. 60, 490గా చూపిస్తుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 తగ్గింది. తులం బంగారం ధర రూ. 55,450 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్లో కిలో వెండి రేటు రూ.500 మేర పడిపోయింది. ప్రస్తుతం కిలో రేటు రూ.76,500 మార్క్ వద్ద ఉంది. హైదరాబాద్లో బంగారం రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అయితే, వెండి రేటు మాత్రం ఢిల్లీతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. వివిధ ప్రాంతాలను బట్టి ధరలు ఉంటాయి.