మీ పెళ్ళికి డబ్బు సహకారం కావాలా? మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయడానికి ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇలా చేయండి. మీ పెళ్ళికి కావలసిన ఖర్చులు వచ్చి మీ బ్యాంక్ ఖాతాల్లో పడతాయి.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఊరకనే అనలేదు. ఎందుకంటే ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈరోజుల్లో వైద్యం కోసం అప్పు చేసేవారి కంటే పెళ్లిళ్ల కోసం అప్పు చేసేవారే ఎక్కువైపోయారు. అంతలా పెళ్లిని ఘనంగా చేయాలని.. ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. కానీ ఇల్లో, పొలమో అమ్మితే తప్ప పెళ్లి చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం కదా.. కొంత డబ్బు రికవరీ అయితే బాగుణ్ణు అనుకునేవారు కూడా ఉంటారు. పెళ్ళికి పెట్టిన ఖర్చు తిరిగి రాబట్టడం ఈరోజుల్లో అంటే కష్టమే. ఒకప్పుడు అంటే బంధువులు, స్నేహితులు వచ్చి తిని ఎంతోకొంత డబ్బులు వేసేవారు.
గృహప్రవేశాలు, పెళ్లిళ్లు ఏ శుభకార్యమైనా సరే వచ్చి తమకు తోచినంత డబ్బు వేసేవారు. పెళ్లి వారికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కుర్చీలో కూర్చుని డబ్బులు వసూలు చేసేవారు. ఒకరు డబ్బులు లెక్కపెట్టడం, మరొకరు డబ్బులిచ్చిన వ్యక్తి పేరు రాయడం ఇదే జరిగేది. ఇప్పటికీ పల్లెల్లో ఇది కొనసాగుతుంది. సిటీల్లో ఈ కల్చర్ లేదు. ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తుంటే కక్కుర్తి పడాలా అని ఆలోచించి తీసుకోవడమే మానేశారు. ఇక బహుమతులంటారా.. అవి పెట్టిన పెళ్లి ఖర్చుల నుంచి ఉపశమనాన్ని ఇవ్వవు. ఈ సంగతి పక్కనపెడితే పెళ్లి ఖర్చులకు అయిన భారాన్ని తగ్గించుకునే అవకాశం అయితే ఉంది. మీకు ఈ అవకాశం కావాలంటే ఒక చిన్న పని చేయాలి. చాలా సింపుల్ ఒక వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలు ఇవ్వాలి.
జాయిన్ మై వెడ్డింగ్ అనే వెబ్ సైట్ ఉంది. వీళ్ళు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే.. మీ పెళ్ళికి అతిథులుగా విదేశీయులను ఆహ్వానించవచ్చు. అందుకోసం విదేశీయుల దగ్గర కొంత డబ్బు విరాళంగా సేకరిస్తారు. పెళ్లి కోసం మీరు వెబ్ సైట్ లో రిజిస్టర్ అయినప్పటి నుంచి విదేశీ అతిథుల వద్ద విరాళాలు సేకరించడం మొదలుపెడతారు. పెళ్లయిన కొన్ని రోజులకు ఖాతాల్లో ఆ డబ్బును జమ చేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితం. అతిథులు డబ్బులు చెల్లించి టికెట్ కొనుక్కుని మీ రంగు రంగుల వివాహాన్ని చూసినట్టన్నమాట. పైగా వారికి కూడా మన కల్చర్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి మీరు కూడా మీ పెళ్లి కోసం డబ్బు సహకారం పొందాలంటే రిజిస్టర్ చేసుకోండి. ఇప్పటికే చాలా మంది జంటలు రిజిస్టర్ చేసుకున్నారు.