రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మన దగ్గర వంట నూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా.. మన దగ్గర మాత్రం దిగి రావడం లేదు. ఇక తాజాగా కేంద్రం వంట నూనె ధరలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కారణంగా మన వంటి ఇంటి ఖర్చులు భారీగా పెరిగాయి. మరీ ముఖ్యంగా యుద్ధం కారణంగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకానొక సమయంలో ఒక లీటర్ వంట నూనె ధర ఏకంగా 200 రూపాయలు పలికింది. పెరిగిన ధర.. చాలా రోజుల పాటు అలానే కొనసాగింది. ఫలితంగా హోటల్స్‌లో టిఫిన్ రేట్లు కూడా పెరిగాయి. గత కొన్ని నెలలుగా వంట నూనె ధర దిగి వస్తోంది. ప్రస్తుతం ఒపెన్ మార్కెట్‌లో కిలో వంట నూనె ధర 150 రూపాయలు ఉంది. అయితే త్వరలోనే వంట నూనె ధర భారీగా తగ్గనుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వంట నూనె ధరలు మరింత దిగి రానున్నాయి. ఫలితంగా సామాన్యులకు ఊరట కలగనుంది.
గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్ల తగ్గుదలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లో కూడా వంట రూనె ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. మన దేశంలో వంట నూనె విక్రయించే కంపెనీలు ఆయిల్ ధరలను తగ్గించాని నిర్ణయం తీసుకున్నాయి. వంట నూనె ధరను ఏకంగా 6 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆయిల్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు భారీ ఊరట లభించనుంది.
ఫార్చూన్ బ్రాండ్ కింద వంట నూనె విక్రయించే అదానీ విల్‌మర్, జెమిని బ్రాండ్ కింద వంట నూనె అమ్ముతున్న జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా వంటి కంపెనీలు వంట నూనె ధరలను వరుసగా లీటరుకు రూ. 5, రూ. 10 చొప్పున తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన రేట్ల ప్రయోజనాలు మరో మూడు వారాల్లో సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వంట నూనె ధరలు దిగి రావడం సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. వంట నూనె ధరల తగ్గింపుకు సంబంధించి… సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) మంగళవారం కీలక ప్రకటన చేసింది.
కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై ఎంఆర్‌పీ తగ్గించాలని తమకు తెలియజేసిందని ఎస్ఈఏ వెల్లడించింది. తమ సభ్యలకు ఈ విషయాన్ని తెలియజేయాలని, రేట్ల తగ్గింపు ప్రయోజనం సామాన్యులకు త్వరితగతిన అందేలా చూడాలని కోరిందని పేర్కొంది. ఇక గత ఆరు నెలలుగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు భారీగా దిగి వచ్చాయి. మరీ ముఖ్యంగా గత 60 రోజుల కాలంలో రేట్లు ఇంకా తగ్గాయి. వేరు శనగ, సోయాబీన్, ఆవ నూనె ఉత్పత్తి కూడా పెరిగింది. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గినప్పటికి.. దేశీ మార్కెట్‌లో మాత్రం ధరలు తగ్గలేదు. ఇక తాజాగా కేంద్ర నిర్ణయంతో వంట నూనె ధరలు భారీగా దిగి రానున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.