ప్రస్తుత కాలంలో చదువుకోవడం కాదు.. కొనడం అవుతోంది. లక్షలు ఖర్చు పెట్టి చదివించినా.. దానికి తగ్గ ఉద్యోగాలు మాత్రం లభించడం లేదు. చదివిన చదువుకు.. చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోతుంది. అరకొర సంపాదనతో.. నగరాల్లో ఖర్చులు భరిస్తూ జీవితాలు వెళ్లదీసేవారు ఎందరో. ఉద్యోగం మానేసి.. వ్యాపారం చేద్దామంటే.. అది ఖర్చుతో కూడుకున్న వపని కావడంతో చాలా మంది.. ఇష్టం లేకపోయినా ఉద్యోగాలు చేస్తూ.. అసంతృప్తితో జీవిస్తుంటారు. అలాంటి వారి కోసం ఓ చక్కని ఐడియా ఇస్తున్నారు వ్యాపార విశ్లేషకులు. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభం పొందే వ్యాపార మార్గాలను సూచిస్తున్నారు.
ప్రతి ఇంట్లో పాల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. సిటీలో అయితే మరీ ఎక్కువ..ఎందుకంటే..ఇక్కడ పాలను తాగే వాళ్లు మాత్రమే దొరుకుతారు. ఈ తరం సిటీలో ఉండే పిల్లలకు పాలు ఎక్కడినుంచి వస్తాయో కూడా తెలియదు. పాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ బిజినెస్ ఎంచుకుంటే మంచి లాభం పొందొచ్చు. పూర్తి వివరాలు కోసం ఈ వీడియో చూడండి.