డబ్బున్న వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలా? సాధారణ మధ్యతరగతి వ్యక్తులు చేయకూడదా? బడ్జెట్ లో స్థలాలు కొని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందలేమా? అంటే అది సాధ్యమే అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో స్థలం కొని పెట్టుకుంటే భవిష్యత్తులో లక్షల్లో లాభాలు పొందవచ్చునని అంటున్నారు. మరి హైదరాబాద్ లో తక్కువ బడ్జెట్ లో స్థలాలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తు ఉంటుంది?
రియల్ ఎస్టేట్ చేయాలి, తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు దిగితే తక్కువ సమయంలో ఎక్కువ లాభం రావాలి అని మీరు అనుకుంటున్నారా? ఐతే మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. హైదరాబాద్ లో గజం రూ. 12 వేలకు, రూ. 15 వేలకు దొరకడం అనేది అసాధ్యం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఏరియాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చునని అంటున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రోడ్డుకెళ్లే మధ్యలో రియల్ ఎస్టేట్ అనేది ఫ్యూచర్ లో డిమాండ్ పెరిగిపోతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ అయినా గానీ ఆర్థిక రాజధాని ముంబై. అందుకే హైదరాబాద్ లో ముంబై హైవే అనేది చాలా కీలకం.
ఇప్పుడు అభివృద్ధి అంతా ఈ ముంబై హైవే మీద ఉన్న నిమ్జ్ వైపు వెళ్తోంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు బాగుంది. అందుకే ఈ ముంబై హైవే వరకూ కొన్ని ఏరియాల్లో ల్యాండ్స్ మీద జనం ఫోకస్ పెడుతున్నారు. ముంబై హైవేలో ల్యాండ్ రేట్లు వచ్చేసి రూ. 12 వేలు, రూ. 15 వేలు, రూ. 18 వేలు, రూ. 20 వేలు వద్ద ఉన్నాయి. చాలా మంది ఈ ఏరియాల్లో కొనేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్ లో హైదరాబాద్ లో వేరే ఏ లొకేషన్ లోనూ స్థలాలు అనేవి దొరకడం కష్టం. చదరపు అడుగు రూ. 1300 నుంచి రూ. 2500 లోపు పలుకుతున్నాయి. ఒక 20, 25, 30 లక్షల రూపాయలతో ముంబై హైవే మీద స్థలాల మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
కమర్షియల్ స్థలాలు కూడా ఉన్నాయి. వీటి మీద పెట్టుబడి పెట్టినా మంచి లాభాలు అయితే ఉంటాయని.. కాకపోతే రెసిడెన్షియల్ ల్యాండ్స్ తో పోలిస్తే కొంచెం ఎక్కువ ధర ఉంటాయని చెబుతున్నారు. కానీ కొన్నందుకు విలువ అనేది ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే నిమ్జ్ అనేది 13 వేల ఎకరాల్లో డెవలప్ అవుతోంది. అభివృద్ధి చెందిన తర్వాత డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు జనాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. ఆ సమయంలో స్థలం కొనాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ ముంబై హైవే మీద ఉన్న ల్యాండ్స్ మీద పెట్టుబడి పెడితే మంచి రాబడి అనేది ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ముంబై హైవే తర్వాత పెట్టుబడికి అనుకూలమైన ఏరియా బెంగళూరు హైవే. బెంగళూరు హైవేలో కొత్తూరు, పింజర్ల వంటి ఏరియాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుందని చెబుతున్నారు. ఈ ఏరియా వైపు ఐటీ కారిడర్ అనేది విస్తరించే అవకాశం ఉంది. అలానే ఈ ఏరియాలో ఒక రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాబట్టి బెంగళూరు హైవే కూడా పెట్టుబడికి మంచి ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ ఏరియా తర్వాత బడ్జెట్ లో దొరికే స్థలాలు వరంగల్ హైవేలోనే. యాదాద్రి భువనగిరి దగ్గర కూడా పెట్టుబడులు పెట్టడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. చదరపు గజానికి రూ. 8 వేలు, రూ. 10 వేలు, రూ. 15 వేలు, రూ. 20 వేలు పెట్టి మరీ కొంటున్నారు.
వరంగల్ కి ఐటీ రంగాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. శైలం హైవే, విజయవాడ హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే, వరంగల్ హైవే ఇలా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది అన్ని దిశల్లో విస్తరిస్తోంది. అయితే వీటిలో తక్కువ బడ్జెట్ లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే గనుక ముంబై హైవే, బెంగళూరు హైవే, వరంగల్ హైవే ఏరియాల్లో పెడితే బాగుంటుందని అంటున్నారు. ఇప్పుడు 20 లక్షలు పెట్టి స్థలం కొని పక్కన పెడితే.. రెండు, మూడేళ్ళలో దాని విలువ రెట్టింపు అవ్వచ్చు లేదా మూడు, నాలుగు రెట్లు పెరగవచ్చు. ఒక్కసారిగా ఆ ఏరియాలు డెవలప్ ఐతే స్థలం రేటు అమాంతం పెరిగిపోతుంది.
గమనిక: పలు రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయాలు, అంతర్జాలంలో దొరికిన డేటా ఆధారంగా చెప్పబడింది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.