బ్యాంకులకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆయా బ్యాంకుల వినియోగదారులు ఎప్పుడు ఆసక్తిగా ఉంటారు. వడ్డీ రేట్ల మార్పులు, బ్యాంకు సెలవుల తో పాటు ఇతర వివరాలు తెలుసుకుంటుంటారు. మరికొన్ని రోజుల్లో ఆగష్టు నెల రాబోతోంది. ఆగస్టు నెలలో బ్యాంకుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను చేసుకోవాలంటే ఆ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆగష్టు నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులు జాబితాను శనివారం విడుదల చేసింది.
RBI క్యాలెండర్ ప్రకారం ఆగష్టు నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంక్ లకి సెలవులు ఉన్నాయి. గెజిటెడ్ సెలవులు, చట్టబద్ధమైన సెలవులు, ఆదివారాలు మొత్తం కలిపి 13 సెలవు ఉన్నాయి. ఈ సెలవు దినాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేయనున్నారు. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు అనే సంగతి అందరికి తెలిసిందే.ఈ సెలవులే కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పండుగలు ఉన్నాయి. అటువంటి ప్రాంతీయ పండుగల సందర్భాలలో వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు తమ స్థానిక శాఖలు కూడా మూసివేయనున్నారు.
13 రోజుల సెలవులు అంటే ఆగష్టు నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఖాతాదారులు.. తమకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. బ్యాంకు సంబంధిత పనులన్నింటినీ ప్లాన్ చేసుకోవాలని బ్యాంకింగ్ అధికారులు సలహా ఇచ్చారు. సెలవు రోజుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.స్వాతంత్ర దినోత్సవంసందర్భంగా ఆగష్టు 15న మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్న సంగతి తెలిసిందే.. ఇతర ప్రాంతీయ సెలవుల్లో గణేష్ చతుర్థి, జన్మాష్టమి, షాహెన్షాహి, మోహర్రం పండుగలు ఉన్నాయి.
ఆగష్టు 2022 బ్యాంక్ సెలవుల వివరాలు:
ఇందులో కొన్ని సెలవు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక సెలవులు ఉండగా.. మరికొన్ని జాతీయ సెలవులు ఉన్నాయి. ఈ తేదీలను వినియోగదారులు దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచించారు.