దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ఏ ముహూర్తాన కరోనా మహమ్మారి అడుగుపెట్టిందో కానీ, సామాన్యులకు ప్రతి వస్తువు భారమే అయిపోయింది. వంట గ్యాస్, ఇంధన ధరలు, నిత్యావసర వస్తువులు.. ఇలా ధర పెరగని వస్తువంటూ ఏదీ లేదు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఆయా రాష్ట్రాలను బట్టి లీటర్ రూ.100 నుంచి రూ. 110 మధ్య ఉన్నాయి. దీంతో బైక్ మెయింటనెన్స్ కూడా సామాన్యులకు పెనుభారంగా మారుతోంది. దీంతో అందరూ అధిక మైలేజ్ ఇచ్చే బైకులపై ఆసక్తి కనపరుస్తున్నారు. అలాంటి వారికి ‘బజాజ్ సీటీ 110 ఎక్స్’ సరైన ఎంపిక.
‘బజాజ్ సీటీ 110ఎక్స్’ బైక్.. లీటరుకు 90 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇది సాధ్యం కాకపోవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ మైలేజ్ సాధ్యం. అందుకే కంపెనీ చెప్పే మైలేజ్‌కు మనం రోడ్డు మీద నడిపే వచ్చే మైలేజ్‌కు కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు. ఈ బైక్ లీటరుకు.. 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇదైనా ఎక్కువ మైలేజ్ అనే చెప్పుకోవాలి. ఇందులో 115 సీసీ డీటీఎస్ఐ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు.
లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుందనుకున్నా.. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. అయితే ఇలాంటి కమ్యూటర్ బైక్స్‌పై ఎక్కువ దూరం ప్రయాణం చేయడం కొంచెం కష్టం. దీని ధర రూ. 66,000 నుంచి ప్రారంభం అవుతోంది. బజాజ్ ఆటో గతంలో సీటీ 100 బైక్‌ను విక్రయించేది. దీని స్థానంలో బీఎస్ 6 ఇంజిన్‌తో సీటీ 110 ఎక్స్ బైక్‌ను తీసుకువచ్చింది. అలాగే ఇందులో మరో వేరియంట్ కూడా ఉంది. బజాజ్ సీటీ 125 ఎక్స్ మోడల్. రెండింటి ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఈ మోడల్‌లో ఇంజిన్ పవర్ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని రేటు కూడా ఎక్కువే. రూ. 75 వేలుగా ఉంది. ఇకపోతే ఈ రెండు బైక్స్ చూడటానికి ఒకేలా ఉంటాయి. యూఎస్‌బీ పోర్ట్ చార్జింగ్, డీఎల్ఆర్ లైట్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
one of the best mileage bike.. pic.twitter.com/9xkieonvHf
— Govardhan Reddy (@gova3555) January 2, 2023