బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి మంచి ఆదరణే లభిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఫోన్లకే అతుక్కుపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. 12 వారాల్లో ఇప్పటికే నాలుగు వారాలు గడిచిపోయాయి. నలుగురు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు కూడా. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నాలుగో వ్యక్తి 7 ఆర్ట్స్ సరయు. అసలు ఆమె ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది? అందుకు గల కారణాలు ఏంటి అనేది పరిశీలిద్దాం.
ఇదీ చదవండి: RRR మేనియా: మూడోరోజూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పంట!
7 ఆర్ట్స్ సరయుకి బయట మాస్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కానీ, బిగ్ బాస్ సీజన్లో మొదటి వారమే ఇంటి నుంచి బయటకు వచ్చి షాకిచ్చింది. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం సీన్ రివర్స్ ఉంటుందని ఆమె చెప్పింది. అభిమానులు కూడా అదే కోరుకున్నారు. ఒకసారి చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని గేమ్ ఆడుతుందని భావించిన అభిమానులకు ఒకింత షాకనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటుందని భావించిన సరయు నాలుగో వారమే బయటకు వచ్చేసింది. మొదటిసారి హౌస్ లోకి వెళ్లినప్పుడు ఆమెకు తానంటే నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదనే చెప్పాలి. ఈసారి మాత్రం గేమ్ ఆడేందుకు ఆమెకు చాలా సమయమే దొరికింది.తను ఎలిమినేట్ కావటానికి ముఖ్యంగా అరియనా,ఆషూ,శివ అని చెప్పుకొచ్చింది. అయితే దొరికిన సమయాన్ని వచ్చిన అవకాశాన్ని ఈసారి కూడా సరయు సద్వినియోగం చేసుకోలేక పోయిందనే టాక్ వినిపిస్తోంది. మొదట సరయుకు మైనస్ అయ్యింది భాష. ఆమె ఎక్కువగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతోంది. తెలుగులో ఎక్కువగా మాట్లాడలేకపోవడం ఆమెకు పెద్ద మైనస్ అని చెప్పాలి. బాడీ షేమింగ్ పై అంతలా రియాక్ట్ అయిన సరయు.. మరొకరిని హౌస్ లో తన వెనుక ఇమిటేట్ చేస్తూ కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియోపై యూట్యూబ్ లో చాలా నెగెటివిటీ వచ్చింది. ఆమె ఏం మాట్లాడుతోంది? ఏం చేస్తోంది అనే క్లారిటీ లేకుండా ఎవరో ఒకరిపై డిపెండ్ అవుతోంది అనే భావన హౌస్ లో ఉంది.. బయట కూడా అదే ఎక్కువగా వినిపిచింది. వెరసి ఇవన్నీ కలిపి సరయు ఎలిమినేట్ అయ్యిందని భావించవచ్చు. సరయు ఎలిమినేషన్ కు కారణం ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.