సింగర్ రేవంత్.. బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ కంటెస్టెంట్ గా దూసుకెళ్తున్నాడు. అయితే రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 గెలవక ముందే రేవంత్ ఇంట సంబరాలు మెుదలైయ్యాయి. రేవంత్ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టే నాటికే రేవంత్ భార్య అన్విత గర్బిణీ. అదీ కాక రేవంత్ హౌజ్ లో ఉన్న సమయంలోనే అన్విత సీమంతం జరిగింది. ఆ శుభకార్యాన్ని బిగ్ బాస్ హౌజ్ లో ప్లే చేసి రేవంత్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో ఆ వీడియో చూసి రేవంత్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తల్లి బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సింగర్ రేవంత్.. తెలుగు సినిమ పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల మూవీల్లో పాటలు పాడుతు స్టార్ సింగర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే టాప్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ 6 లోకి అడుగుపెట్టాడు. తనదైన దూకుడుతో హౌజ్ లో దూసుకెళ్తున్నాడు. అయితే హౌజ్ లోకి అడుగు పెట్టే నాటికే రేవంత్ భార్య అన్విత నిండు గర్భిణి. దాంతో ఇలాంటి సమయంలో భార్యను వదిలి వచ్చినందుకు ఎంతగానో బాధపడ్డట్లు హౌజ్ లో పలు మార్లు చెప్పుకొచ్చాడు రేవంత్. అయితే రేవంత్ చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరం కావడంతో.. పెళ్లి తర్వాత ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపిచ్చుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్ అన్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా అతడి ఎదురుచూపులకు తెరపడింది. రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ విషయం హౌజ్ లో ఉన్న రేవంత్ కు తెలిస్తే అతడి ఆనందానికి అవధులు ఉండవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ 6 విన్నర్ రేసులో ముందువరుసలో ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి దుకుడైన స్వభావంతో దూసుకెళ్తున్నాడు రేవంత్.