సచిన్ తో కలిసి క్రికెట్ ఆడిన ఓ దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ రెండో సారి తండ్రి అయ్యాడు.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న సంఘటన, వేడుకలు జరిగినా గానీ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు సెలబ్రిటీలు. కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ క్రికెటర్ రెండోసారి తండ్రైయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. సచిన్ తో పాటుగా క్రికెట్ ఆడిన ఈ ప్లేయర్ తాజాగా రెండో సారి తండ్రి అవ్వడం విశేషం. మరి ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసుకుందాం.
దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ చరిత్రను లిఖించుకున్నాడు ఈ క్రికెటర్. తన ఆల్ రౌండ్ ఫర్ఫామెన్స్ తో ప్రొటీస్ జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. అతడు ఎవరో కాదు దిగ్గజ ఆల్ రౌండర్, మాజీ సౌతాఫ్రికా ప్లేయర్ జాక్వెస్ కల్లీస్. తనదైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో తిరుగులేని ఆటగాడిగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. తాజాగా తాను రెండో సారి తండ్రి అయినట్లు పోస్ట్ ను షేర్ చేశాడు. తన భార్య పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు అతడు తెలిపాడు. భార్యా, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు కల్లీస్ తెలిపాడు. ఇక తన కల్లీస్ కు ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు.