బిగ్ బాస్ అంటే గొడవలు కచ్చితంగా ఉండాలి. లేకపోతే ప్రేక్షకులు.. అబ్బే అని పెదవి విరుస్తారు. పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే ప్రతివారం కూడా కంటెస్టెంట్స్ మధ్య ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఇక నామినేషన్స్ పై అంటేనే ఒకరిపై ఒకరు అరుస్తూ రెచ్చిపోతుంటారు. గతవారం మాత్రం నామినేషన్స్ ప్రక్రియ చప్పగా అనిపించింది. ఈ వారం మళ్లీ పాత రూటులోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి నామినేషన్స్ లో ఎక్కువగా రేవంత్ హైలెట్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఇంట్లో ఎనిమిది మంది సభ్యులు మిగిలారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక ఈ వారం నామినేషన్స్.. హీట్ తో సాగింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రేవంత్-ఆదిరెడ్డి.. నువ్వానేనా అని తలపడ్డారు. నువ్వు చెప్పేది వింటాను అంటే నువ్వే చెప్పేది వింటాను అని ఇద్దరూ కూడా ఫ్లోర్ పై కూర్చుని మరీ కౌంటర్లు వేసుకున్నారు. ఇక ఫైమా.. రోహిత్ ని నామినేట్ చేసింది. ఇంట్లో ఫిజికల్, స్ట్రాంగ్ గా ఉండేది రేవంత్ తర్వాత నువ్వే అని చెప్పి రోహిత్ ని నామినేట్ చేసింది.
ఇక ఇదే విషయమై ఫైమాతో రేవంత్ గొడవపడ్డాడు. ‘వేరే వాళ్ల సపోర్ట్ లేనిదే గేమ్ ఆడలేవు, నువ్వు నాకు చెబుతున్నావ్’ అని అన్నాడు. దీనిపై చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన ఫైమా.. ‘నువ్వు ఏ సపోర్ట్ తో ఆడావ్?’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. ఇలా ఇద్దరి మధ్య ఫుల్ హీట్ నడించింది. ఓ సందర్భంలో ఫైమా, రేవంత్ కి తన వేలు చూపిస్తూ మాట్లాడింది. దీన్ని తీసుకోలేకపోయిన రేవంత్.. గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయాడు. దీంతో రేవంత్ గురించి ఫైమా ఓపెన్ అయింది. ‘ముందు ఒకలా మాట్లాడతాడు, వేరేచోట మరోలా మాట్లాడుతాడు. ఈ పాయింట్ గురించి ఎవరూ ఏం మాట్లాడట్లేదు. ఎందుకు?’ అని ఫైమా మిగతా హౌజ్ మేట్స్ ని క్వశ్చన్ చేసింది. మరి ఫైమా-రేవంత్ గొడవపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.