అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరిన చలాకీ చంటి లేటెస్ట్ హెల్త్ అప్డేట్ వచ్చేసింది. ఎలా ఉన్నారో ఏంటో తెలిసిపోయింది.
‘జబర్దస్త్’తో పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో చలాకీ చంటి ఒకడు. షో మొదలైనప్పటి నుంచి టీమ్ లీడర్స్ చేసిన ఇతడు.. గతేడాది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఒకటి రెండు షోల్లో కనిపించాడు. అంతే అప్పటినుంచి బయట ఎక్కడా చంటి కనిపించలేదు. అలాంటిది సడన్ గా అతడు హెల్త్ పాడైందనే వార్త న్యూస్ లో వచ్చింది. ఫస్ట్ ఎవరూ నమ్మలేదు కానీ ఆ తర్వాత ఇది నిజమేనని తేలింది. ప్రస్తుతం అతడు సీరియస్ కండీషన్ లో ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ప్రస్తుత హెల్త్ అప్డేట్ కూడా వచ్చేసింది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. చలాకీ చంటి చాలారోజుల నుంచి ఎక్కడా షోల్లో గానీ బయట కనిపించలేదు. బహుశా ఏమైనా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా గుండె సంబంధిత సమస్యల వల్ల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు వార్తలొచ్చాయి. తొలుత ఎవరూ నమ్మలేదు కానీ ఇది నిజమేనని తేలింది. హాస్పిటల్ లో చేరినప్పుడు చంటి కండీషన్ సీరియస్ గా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారం ఇతడిని డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. చలాకీ చంటి త్వరగా కోలుకుని, మనల్ని ఎంటర్ టైన్ చేయాలని కోరుకుందాం!