బిగ్ బాస్ లో అప్పుడే ఆట మొదలైందా అన్నట్టుగా భలే రంజుగా సాగుతుంది. ఈసారి బిగ్ బాస్ 5 సీజన్ కి మొదటి కెప్టెన్ గా సిరి హనుమంతు ఎంపిక అయ్యింది. ఇక బిగ్ బాస్ ఇంట్లో యాక్టివ్ గా ఉండే కంటెస్టెంట్లలో ఆర్జే కాజల్ ఒకరు. బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ప్రతి విషయంలో తనదైన మార్క్ చాటుకోవాలని తెగ ఉత్సాహ పడుతుంది.. ఇదే సమయంలో అతి చేస్తున్నావంటూ ఇంటి సభ్యులు ఆమెపై విమర్శలు కూడా గుప్పించారు.
మూడు రోజుల క్రితం కిచెన్ లో ఒక హౌస్ లో ప్రియతో మాట్లాడుతూ తనకు కిచెన్ శుభ్రపరిచే పని నచ్చదని, తన ఇంట్లో కూడా శుభ్రం చేయనని చెప్పింది. దాంతో బిగ్ బాస్ లోకి వెళితే అన్ని పనులు చేయాలీ.. ఇలా తప్పించుకుంటే ఎలా అని అప్పుడే నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌజ్ లో నాకు వంట రాదు అంటూ ఇంట్లో పచ్చి అబద్ధం చెప్పేసింది.. దాంతో గతంలో ఆర్జే కాజల్ చేసిన వంటల వీడియోలు వెతికి మరీ పట్టుకొని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ అన్ని భాషల్లోని, అన్ని సీజన్లను చూశానని, ఇది తన డ్రీమ్ అని చెప్పుకునే కాజల్ కు, బిగ్ బాస్ హౌస్లో కేవలం నిజం మాత్రమే మాట్లాడాలని, అబద్ధం చెబితే నెటిజన్లు ఆటాడేసుకుంటారని తన తోటి సభ్యులతో చెప్పింది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ కి మొదటి కెప్టెన్ గా సిరి ఎంపిక అయ్యింది. దాంతో సామరస్యంగా ఇంటి సభ్యుల పనుల బాధ్యతను అప్పజెప్పేందుకు పూనుకుంది. ఈ క్రమంలో కాజల్ తనకు వంట రాదని, కిచెన్ డిపార్ట్ మెంట్ వద్దని తెగేసి చెప్పింది. ఇప్పుడు ఇదే ఆమె కొంప ముంచింది. నెటిజన్లు ఆమె వంట చేసిన వీడియోను వెతికి తీసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో కాజల్ చేపల కూర, మిరపకాయ బజ్జీలు చేస్తూ కనిపించింది. మరి ఈ వీడియో విషయం ఏంటీ.. నువ్వు చేసింది అబద్దమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక కాజల్ అక్క ఇంటికి సోహైల్, అఖిల్ ని ఆహ్వానించినపుడు ఆ వీడియోలో కాజల్ తన కూతురి పుట్టినరోజుకు బిర్యానీ వండినట్టు కూడా బయటపడింది. దీన్ని బట్టి చూస్తే ఆమెకు వంట వచ్చని అర్థమవుతోంది, అనవసరంగా చిన్న అబద్ధమాడి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యింది.
Cooking radu Anna #RJKajal cooking videos.#BiggBossTelugu5 #biggboss5telugu #5muchdrama #FiveMuchFun pic.twitter.com/GKmfb3PeD2
— PeddaDora (@DoraPedda) September 10, 2021