ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అనేది ఎంతో మంది పిల్లల ఆకలి తీర్చుతుంది. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్ధుల ఆకలి తీర్చేందుకు, అదే విధంగా డ్రాఫ్ అవుట్ శాతం తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏ ప్రభుత్వం వచ్చిన ఈ పథకాన్ని కొనసాగిస్తు వస్తున్నాయి. తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కూడా మధ్యాహ్న భోజనం మెనులో పలు మార్పులు చేసింది. విద్యార్ధులు గుడ్లు,మాంసం, ఇతర పోషకాలు అందేలా మెను తయారు చేశారు. ఇవి సక్రమంగా అమలవుతున్నాయా? లేదా? అని అధికారులు, ఎమ్మెల్యేలు తనిఖీలు చేస్తుంటారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓ స్కూల్ లో మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ పిల్లలకు సరిపడ కూర, గుడ్లు లేకపోవడంతో ఉపాధ్యాయులు, వంట మనిషిపై ఫైర్ అయ్యారు. అదే సమయంలో వంట మనిషి చెప్పిన ఓ వింత సమాధానం ఇచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు పంచాయితీలో నిర్వహించిన ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. ముందుగా పాఠశాలలో ఎంత మంది పిల్లలున్నారో తెలుసుకునేందుకు హాజరు పట్టికను ఎమ్మెల్యే చేశారు. 150 మంది పిల్లలు ఉన్నారని తెలుసుకున్నారు. అనంతరం వంట గదిలోకి వెళ్లి.. వంటలను పరిశీలించాడు. అప్పుడే వంట మనిషి గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టింది. అయితే పిల్లలు ఎక్కువగా ఉంటే కూరలు, గుడ్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయేంటని టీచర్లను ఎమ్మెల్యే ప్రశ్నించాడు. దీనికి టీచర్లు.. ఎమ్మెల్యేకు వివరణ ఇచ్చారు.
అలానే గుడ్లు ఎన్ని ఉన్నాయంటూ వంటమనిషిని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 150 గుడ్లు ఉన్నాయని సమాధానం ఇచ్చారు. పక్కన ఉన్న సిబ్బంది వాటిని లెక్కించడగా 115 మాత్రమే ఉన్నాయి. దీంతో మిగిలిన 35 గుడ్లు ఎమయ్యాయమ్మ అని ఎమ్మెల్యే అడగగా..కాకులెత్తుకెళ్లాయ సార్ అంటూ వింత సమాధానం చెప్పింది. దీంతో షాకైన ఎమ్మెల్యే.. ప్రధానోపాధ్యాయురాలికి, స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్, మిగిలిన వారిని కూడా పిలిపించి కాస్త గట్టిగానే హెచ్చరించాడు. “మీ ఇంట్లో పిల్లలకి కూడా ఇలాగే అన్నమే పెడతారా?” అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాకులు ఎత్తుకెళ్లాయంటూ.. కాకమ్మ కథలు చెబితే నమ్మే వాడిలాగా కనపడుతున్నానా? అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే వంట సిబ్బందిని తొలగించి, బాగా వండే వాళ్లను తీసుకొమని సూచించారు.
ఇకపై ఎప్పుడూ ఇలాంటి తప్పులు జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే గట్టిగానే హెచ్చరించారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలపై ఎప్పుడూ విమర్శలతో విరుచుకుపడే ఎమ్మెల్యే ప్రసన్న తనవారు అనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారని స్థానికంగా మాటలు వినిపిస్తుంటాయి. అనుచరులను ఎప్పుడూ ఆయన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారటని అనుచరులు చెప్పుకుంటారు. వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటారట. ఇటీవల నెల్లూరులో భారీ వర్షాలకు నష్టపోయిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన అండగా నిలిచారు.