బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్లపీడనం ఏర్పడింది. అది రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని IMD అధికారులు తెలిపారు. మార్చి 3 నుంచి 5వతేదీల మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. మార్చి 4,5 తేదీల్లో దక్షిణ కోస్తా , రాయలసీమలలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావం వల్ల గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.