తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురి అవుతున్నారు.
గత పదిరోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. కుండపోత వానలతో హైదరాబాద్ నగర రోడ్లన్నీ జలమయం అయి చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీల్ పొంగిపొర్లుతున్నాయి. రానున్న మూడు రోజులు నగరంలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వర్షాలు పడటంతో ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని.. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా స్కూళ్ళ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో సోమవారం సాయంత్రం నుంచి వర్షం దంచికొడుతుంది. తెలంగాణలో సోమవారం విద్యార్థులు స్కూళ్లకు వెళ్లి వచ్చిన తర్వాత వర్షం పడటం మొదలయ్యింది. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.. మ్యాన్ హూల్స్ ప్రమాదం ఉంటుంది.. తమ పిల్లలు బయటకు వెళ్తే ఇబ్బందులు పడతారని సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు సెలవు ప్రకటించాని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల సమయంలో మార్పులు చేసింది.
ప్రైమరీ స్కూళ్ళు (1 వ తరగతి నుంచి 5వ తరగతి వరకు) ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకు, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు (6వ తరగతి నుంచి 10వ తరగతి) ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు పనిచేయాలని ఆదేశించింది. అదేవిధంగా హైస్కూల్ క్యాంపస్‌లో నడుస్తున్న ప్రైమరీ స్కూళ్లకు ఈ టైమింగ్స్ వర్తిస్తాయి. స్కూళ్లకు కొత్త టైమింగ్స్ గురించి స్కూల్ ఎడ్యూకేషనల్ రిజీనల్ జాయింట్ డైరెక్టర్, డీఈఓ కార్యాలయాలు అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. కాకపోతే జంటనగరాల్లో మాత్రం అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే పాఠశాలలు పనిచేస్తాయని.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పాఠశాల టైమింగ్స్ లో మార్పు లేవని విద్యార్థులు, తల్లిదండ్రులు ఇది గమనించాలని తెలిపారు.