నేటికాలంలో బంధాలకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంలో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను నిర్ధాక్షిణ్యంగా కన్నవారు హత్య చేస్తున్నారు. తాజాగా.. భార్యతో ఘర్షణ పడుతున్నాడని.. విచక్షణ కొల్పోయిన ఓ తండ్రి.. కుమారుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఈఘటన శనివారం యన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దు గాబ్రియేలు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గాబ్రియేల్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలయ్యాయి. కుమారుడు కిరణ్.. ఇంటర్ పూర్తి చేసి పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. గాబ్రియేల్ భార్య మృతి చెందటంతో 2007లో తిరుపతమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. గాబ్రియేల్ దంపతుల వద్దనే కిరణ్ ఉంటున్నాడు. కొన్నాళ్ల నుంచి గాబ్రియేల్ భార్య తిరుపతమ్మకు, కుమారుడు కిరణ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కిరణ్‌ను ఇంట్లో నుంచి పంపించాలని .. వారం రోజులుగా గాబ్రియేల్‌ను తిరుపతమ్మ ఒత్తిడి చేస్తోంది.
ఈ క్రమంలోనే మరొసారి తిరుపతమ్మ, కిరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కిరణ్ ఉన్న ఇంట్లో తాను ఉండనని భర్తకు చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లింది. కిరణ్ కూడా ఇంటి నుంచి వెళ్లి పోవాలని గాబ్రియేలు చెప్పగా..ఇల్లు తనదని తండ్రికి ఎదురు తిరిగాడు. కిరణ్ అన్న మాటలు మనసులో పెట్టుకున్న గాబ్రియేలు.. శనివారం తెల్లవారు జామున నిద్రపొతున్న కొడుకు మెడపై గొడ్డలితో కిరాతంగా నరికాడు. దీంతో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు వీరులపాడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.