ఇప్పటికే పెరిగిన నిత్యవసర ధరలు, ఇంధన ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది ఏపీఎస్ ఆర్టీసీ. ఏపీలో బస్ ఛార్జీలను ఆర్టీసీ సంస్థ భారీగా పెంచేసింది. పల్లె డీజిల్ సెస్ పేరుతో వెలుగు బస్సులో రూ.2, ఎక్స్ ప్రెస్ లో రూ.5 , ఏసీ బస్సులో రూ.10 చొప్పున ఛార్జీలను పెంచుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటన చేశారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీజిల్ బల్క్ రేటు విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు కూడా రాకపోతే పూర్తి నష్టాల్లోకి వెళుతుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిజీల్ సెస్ కింద పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు.
పెరిగిన ధరల ప్రకారం.. పల్లె వెలుగు బస్సులో కనీస టికెట్ ధర రూ.10 గా ఉందని పేర్కొన్నారు. పెరిగిన బస్సు ఛార్జీలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. “డీజిల్ సెస్ వల్ల ఏడాదికి రూ.720 కోట్లు మాత్రమే వచ్చే అవకాసం ఉంది. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే టిక్కెట్లపై 32 శాతం మేర ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. కరోనా కారణంగా గత రెండేళ్ల కాలంలో రూ. 5,680 కోట్లు నష్టం వచ్చింది” అని ఏపీ ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు. మరి..ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.