టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధర్మారెడ్డితో పాటు ఆయన సతీమణి కూడా కుమారుడి మరణంతో తల్లడిల్లిపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 28 ఏళ్ల వయసులో చంద్రమౌళి మరణించటంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ చంద్రమౌళికి ఏం జరిగింది? ఆయన ఎలా మరణించారు?..
పెళ్లి పత్రిక ఇవ్వటానికి వెళ్లి గుండెపోటుకు గురై..
ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం చంద్రమౌళికి టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో పెళ్లి కుదిరింది. వచ్చే నెలలో పెళ్లి జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు కూడా ఓ కొలుక్కి వచ్చాయి. చంద్రమౌళి పెళ్లి పత్రికలు పంచే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని బంధువుల ఇంటికి పత్రిక ఇవ్వటానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన ఛాతిలో నొప్పిగా ఉందంటూ కుప్పకూలారు. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి వైద్యులు చెప్పిందేంటంటే..
చంద్రమౌళి రెడ్డి అనారోగ్యంపై కావేరీ ఆస్పత్రి వైద్యులు 19న హెల్త్ బులిటెన్ విడుద చేశారు. డిసెంబర్ 18న చంద్రమౌళి రెడ్డి సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని తమ ఆసుపత్రికి తీసుకువచ్చారని అన్నారు. ఆయనకు వెంటనే సీపీఆర్ ఇచ్చామని, ఆ తర్వాత కాత్‌ల్యాబ్‌కు పంపామని వెల్లడించారు. స్టంట్ కూడా వేశామని తెలిపారు. మల్టిపుల్ ఆర్గాన్ సపోర్ట్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని స్పష్టం చేశారు. స్పెషలిస్టు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఫలించని ప్రయత్నాలు.. మరణంలోనూ మంచి మనసు..
చంద్రమౌళి పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది. బుధవారం ఉదయం డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ చంద్రమౌళి చనిపోయారు. చనిపోయినా కూడా తన కారణంగా ఇతరులకు మంచి జరగాలని ఆయన భావించారు. చాలా ఏళ్ల క్రితమే కళ్లు దానం చేసే కార్యక్రమంలో ఆయన తన పేరు నమోదు చేసుకున్నారు. చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు తల్లిదండ్రులు ఆయన కళ్లను దానం చేశారు. చంద్రమౌళి గొప్ప మనసుకు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే గుండెపోట్లు రావటం తరచుగా జరుగుతోంది. ఇందుకు చాలా థియరీలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఈ ఆధునిక కాలంలో మనిషి తన ఆరోగ్యం గురించి పూర్తిగా పట్టించుకోవటం మానేశాడు. తినే తిండి మీద, శరీరం మీద దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడూ టెన్షన్స్‌తో బతుకుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
#TTD EO Dharma Reddy’s son Chandramouli Reddy passed away after battling for three days after he suffered a major heart stroke. An official bulletin of #Chennai Kauvery hospital says he passed away at 8.20 am on Wednesday. pic.twitter.com/0ZtYwOZDoO
— Sri Krishna (@SriKrishna_TNIE) December 21, 2022