ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాకు ‘ఎన్టీఆర్ జిల్లా’గా నామకరణం చేయడంపై టీడీపీ నేతలు, నందమూరి వారసులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించకపోవడంపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. పార్టీ అధినేత నుంచి కార్యకర్తల వరకు ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం ఏంటని రక రకాలుగా చర్చించుకుంటున్నారు. కాకపోతే ఎన్టీఆర్ తనయ, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మాత్రం స్పందించారు. ‘‘ఆ మహనీయుడు నందమూరి తారకరామారావు గారు పుట్టిన జిల్లాకు ‘ఎన్టీఆర్ జిల్లా’ అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా స్వాగతిస్తున్నాను’’ అంటూ ట్విట్ చేశారు.
ఇది చదవండి : వెస్టిండీస్ సిరీస్ కి.. భారత జట్టు ఎంపిక
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జిల్లా నామకరణంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా స్పందించలేదు. టీడీపీ చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా ముందుగా ఎన్టీఆర్ పేరు తలవకుండా ఉండరు.. ఆయన విగ్రహానికి పూలమాల వేయకుండా ప్రారంభమవదు. అలాంటిది ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు స్పందించలేదనేది ప్రశ్నార్ధకంగా మారిందని వైసీపీ నేతలు, నెటిజన్లు అంటున్నారు. మరోవైపు విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది చదవండి: బాలయ్య షోకు చిరు రాకపోవడానికి అసలు కారణమిదే!
ప్రభుత్వం కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నెలరోజుల సమయం ఇచ్చింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చెందిన వారు జిల్లాపేర్లు, జిల్లా కేంద్రాలు, ఇతర అంశాలపై స్పందిస్తున్నారు. మరి విజయవాడ కు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం పై ముందు ముందు ఎలాంటి చర్చలు జరుగుతాయో.. ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం, ఆయన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను.
ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది.జై ఎన్టీఆర్!!! pic.twitter.com/r4pbKKrled
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) January 26, 2022