ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాకు ‘ఎన్టీఆర్ జిల్లా’గా నామకరణం చేయడంపై టీడీపీ నేతలు, నందమూరి వారసులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించకపోవడంపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. పార్టీ అధినేత నుంచి కార్యకర్తల వరకు ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం ఏంటని రక రకాలుగా చర్చించుకుంటున్నారు. కాకపోతే ఎన్టీఆర్ తనయ, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మాత్రం స్పందించారు. ‘‘ఆ మహనీయుడు […]