గత కొంత కాలంగా ఏపీలో చెడ్డీ గ్యాంగ్ దడ పుట్టిస్తోంది. బలమైన ఆయుధాలతో ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తోంది. పట్టుకునేలోపే పారిపోతారు.. ఎప్పుడు కొత్త కొత్త స్కెచ్ వేస్తూ దోపిడీలకు పాల్పడుతుంటారు చెడ్డీ గ్యాంగ్. . చిక్కరు.. దొరకరు అనే టైపులో ఖాకీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు ముఠా సభ్యులు. హైదరాబాద్ జంటనగరాలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు ఏపీలో వరుస దోపిడీలతో హల్ చల్ చేస్తోంది. ఈ దోపిడీల్లో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరక్కుండా చెడ్డీగ్యాంగ్ చాకచక్యంగా వరుస దోపిడీలతో హడలెత్తిస్తోంది. తాజాగా ఏపిలో అలజడి సృష్టిస్తోన్న చెడ్డీ గ్యాంగ్ ఫొటోలు విడుదలయ్యాయి.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గ్యాంగ్‌లో కొందరు గుజరాత్ దాహౌదు జిల్లా నుంచి వచ్చినట్లు ఎపి పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దాహౌదు పోలీసులను ఎపి పోలీసులు సంప్రదించారు. చెడ్డీ గ్యాంగ్ బెజవాడ వాసుల్ని బేజారెత్తిస్తున్నారు. బెజవాడ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. బెజవాడ పోలీసులకు సవాల్ గా మారింది చెడ్డి గ్యాంగ్. వసరగా పాల ఫ్యాక్టరీ, గుంటుపల్లి, రైయిన్ బో విల్లాస్ లో వారం రోజుల్లో వ్యవధిలోనే వరుస చోరీలతో హడలెత్తిస్తోంది చెడ్డీగ్యాంగ్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఏదోక ప్రదేశం సంచరిస్తు ప్రజల భయబ్రంతులకు గురి చేస్తోంది చెడ్డి గ్యాంగ్.
ఈ మద్య చెడ్డీ గ్యాంగ్ బెజవాడ వాసుల్ని బేజారెత్తిస్తున్నారు. బెజవాడ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. బెజవాడ పోలీసులకు సవాల్ గా మారింది చెడ్డి గ్యాంగ్. వసరగా పాల ఫ్యాక్టరీ, గుంటుపల్లి, రైయిన్ బో విల్లాస్ లో వారం రోజుల్లో వ్యవధిలోనే వరుస చోరీలతో హడలెత్తిస్తోంది చెడ్డీగ్యాంగ్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఏదోక ప్రదేశం సంచరిస్తు ప్రజల భయబ్రంతులకు గురి చేస్తోంది చెడ్డి గ్యాంగ్. పోలీసులు చెడ్డీగ్యాంగ్ ఆటకట్టించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు పట్టణం నుంచి పల్లెల వరకు గాలిస్తున్నారు. ఉన్నత పోలీస్ యంత్రాంగం ఎనిమిది బృందాలను నియమించింది. నిందితుల కోసం కృ ష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు గాలింపు చేపట్టారు.