పోలీసులు, అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా కూడా వ్యభిచారాన్ని ఏదో రూపంలో కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు దాడులు చేస్తూ, నిర్వాహకులను అరెస్టు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా కొత్త కొత్త రూపాలలో ఈ వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. స్పా ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకులు, యువతులు, విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన రైడ్ వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ పటమట గురునానక్ కాలనీలో ఈ హైటెక్ వ్యభిచారం వెలుగు చూసింది. సీఐ కాశీనాథ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఎన్ఏసీ కల్యాణ మండపం సమీపంలోని కేస్టూడియో భవనంలో స్పా సెంటర నిర్వహిస్తున్నారు. అయితే అది పైకి మాత్రమే స్పా సెంటర్ గా కనిపిస్తుంది. లోపల మాత్రం అంతా గలీజ్ దందానే నడుస్తుంటుంది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి.. ఇద్దరు నిర్వాహకులు, 8 మంది యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.