మత్తు పదార్థాల కోసం యువత బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా చెరిపేసుకుంటూ.. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులకు శోకాన్నిమిగిలుస్తున్నారు. కాగా, వీటి వల్ల కుటుంబాలకు కుటుంబాలు బాధితులవుతున్నారు కానీ.. వాటిని అమ్మే వారిపై చర్యలు ఉండటం లేదు. అయితే తాజాగా పోలీసులు రంగంలోకి దిగారు..
నేటి యువత వ్యవసనాలకు అలవాటు పడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మత్తు పదార్ధాలకు బానిసలై తప్పు దోవపడుతున్నారు. యువతకు విరివిగా సరుకు దొరకడంతో.. వాటిని తీసుకుంటూ అందులోనే జోగుతున్నారు. వాటికి లోబడి అవి సకాలంలో దొరక్కపోతే పిచ్చివాళ్లుగా మారిపోతున్నారు. మత్తు పదార్థాల కోసం చంపడానికి కూడా వెనుకాడటం లేదు. చివరకు బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా చెరిపేసుకుంటూ.. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలుస్తున్నారు. కాగా, వీటి వల్ల కుటుంబాలకు కుటుంబాలు బాధితులవుతున్నారు కానీ.. వాటిని అమ్మే వారిపై చర్యలు ఉండటం లేదు. దీంతో పోలీసులపై కూడా అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా గంజాయి.. యువతకు విరివిగా లభిస్తుంది. అటు విజయవాడలో కూడా వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ.. చిన్న, పెద్ద మొత్తంలో గంజాయి లభిస్తుండటంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తీరా యువతకు సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ మహిళపై నగర బహిష్కరణ విధించారు. విజయవాడలో ఓ మహిళ నగర బహిష్కరణకు గురి కావడం ఇదే ప్రథమం. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసులు ఆందోళన కలిగిస్తుండటంతో.. వాటి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ఈ నగర బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు. గంజాయి అమ్ముతూ.. పోలీసులకే తలనొప్పిన మారిన ఆ మహిళ పేరు సారమ్మ అలియాస్ జొన్నలగడ్డ శారద. ఈ ఖతర్నాక్ మహిళ.. పోలీసులు కళ్లుగప్పి గంజాయి సరఫరా చేయడంలో దిట్ట.
ఇప్పటికే ఆమెపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో 13కు పైగా కేసులున్నాయి. గంజాయితో పాటు పలు వివాదాల్లో ఆమె ప్రమేయం ఉంది. అయితే ఎన్ని సార్లు హెచ్చరించినా, కేసులు పెట్టిన తీరు మారడం లేదు. దీంతో ఆమెను నగరం నుండి బహిష్కరించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆమెతో 19 మందిని విజయవాడ నగరం నుండి బహిష్కరించారు. మరోసారి వీళ్లు గంజాయి కేసుల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ క్రాంతి రాణా టాటా వార్నింగ్ ఇచ్చారు. నగర బహిష్కరణకు గురైన వారిలో సారమ్మ అనే మహిళ ఉండడం.. తొలిసారిగా ఓ మహిళపై సీరియస్ యాక్షన్ ఉండడం చర్చనీయాంశమైంది.