ఓ యువతి తీసుకున్న గొప్ప నిర్ణయం ఓ కుటుంబంలో వెలుగు నింపింది. చనిపోయిన అక్క బిడ్డల కోసం ఆ యువతి వారికి తల్లిగా మారింది. కని పెంచకపోయినా.. ఇకపై కనిపెట్టుకు ఉంటానని ఆ బిడ్డలకు ప్రమాణం చేసింది. పిల్లలకు దేవుడు ఇచ్చిన తల్లిగా.. బావకు తోడుగా ఆ కుటుంబంలోకి అడుగుపెట్టింది. తల్లిదండ్రులను.. ఆఖరికి ప్రాణలను సైతం లెక్క చేయకుండా ఆమె తీసుకున్న నిర్ణయానికి తెలుగు రాష్ట్రాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు తెలుగు వాళ్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆమెను ఓ దేవత అంటూ కొనియాడుతున్నారు.
జిల్లా ఎస్పీ ఆఫీసులో బావతో పెళ్లి అనంతరం మీడియాతో ఆమె మాట్లాడిన మాటల తాలూకా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెను ప్రశంసల జల్లులో ముంచెత్తుతున్నారు. ఆమె మంచి హృదయానికి కార్పూర హారతి పడుతున్నారు. దేవుడు ఆమెను చల్లగా దీవించాలని కోరుకుంటున్నారు. సమాజం మొత్తం సంకనాకిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు అందంతో పాటు దేవుడు మంచి మనసు కూడా ఇచ్చాడంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇంతకీ సంగతేంటంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని కుంచనపల్లికి చెందిన ఓ మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి 9 ఏళ్ల క్రితం పెళ్లయింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సదరు మహిళ మృత్యువాతపడింది. తల్లి చనిపోవటంతో ఆమె బిడ్డలు ఎంతో మానసిక క్షోభను అనువిస్తూ ఉన్నారు. తమ పనులు తాము సరిగా చేసుకోలేని వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం చేస్తున్న వారి తండ్రి దుర్గారావుకు ఆ ఇద్దరు పిల్లలను చూసుకోవటం ఇబ్బందిగా మారింది. ఓ వైపు ఉద్యోగం మరో వైపు పిల్లల స్కూలు ప్రతిరోజు కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనపించే యుద్ధం చేసేవాడు.
ఈ నేపథ్యంలో అక్క బిడ్డలు పడుతున్న కష్టాలను చూసి వారి పిన్ని పావని చలించిపోయింది. ఆడతోడు లేని కుటుంబం ఇన్ని కష్టాలు పడాలా? అని అనుకుంది. ప్రతి రోజూ అక్క పిల్లల గురించే ఆలోచించసాగింది. ఈ నేపథ్యంలోనే ఓ నిర్ణయానికి వచ్చింది. బావతో పెళ్లికి సిద్ధమైంది. పావని తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. అయితే, వారు ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. ఇంట్లో వాళ్లు ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఆఖరికి చంపుతామని కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలోనే పావని, దుర్గారావు ఎస్పీ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నారు.