నందమూరి బాలకృష్ణ.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు రాజకీయాలతో బిజీగా గడిపున్నాడు. నిజానికి ఇలా.. క్షణం తీరక లేకుండా గడపటం చాలా మందికి నచ్చదు. అందులోనూ పేరు, డబ్బు సంపాదించిన స్టార్లకు అయితే అస్సలు నచ్చదు. కానీ, బాలకృష్ణను మాత్రం అందుకు విరుద్ధం. అన్నీ ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. సేవ చేస్తున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా.. తానున్నా అంటూ భరోసా ఇస్తున్నాడు. ఈ క్రమంలో అభిమాని కోరిక మేరకు గృహప్రవేశంలో పాల్గొన్న బాలకృష్ణ.. అందరికి నవ్వులు తెప్పించాడు.
తాజాగా, హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే నందమూరి బాలయ్య.. అభిమాని ఆహ్వానంతో గృహప్రవేశ వేడుకకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్న బాలకృష్ణ.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి అభిమాని స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు బాలకృష్ణకు ఘనస్వాగతం పలికారు. కిరికెరలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాలయ్య.. అనంతరం అభిమాని రాము గృహప్రవేశ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో.. చోటుచేసుకున్న ఒక సంఘటన అందరికి నవ్వులు పూయిస్తోంది. బాలయ్య అభిమానులతో మచ్చటిస్తున్న సమయంలో ఒక పాప తండ్రి ఒడిలో నిద్రపోతూ కనిపించింది. అది చూసిన బాలయ్య.. “ఓయ్ పాప.. లేవ్” అంటూ పాపను నిద్రలేపాడు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారందరు బాలకృష్ణది చిన్నపిల్ల మనస్తత్వం అంటూ ఒప్పొంగిపోతున్నారు.
😂😂😂😂😂😂😂 pic.twitter.com/4Jn4u0ch6u
— 11-01-23 (@OnlyFrPSPK) June 2, 2022
ఇది కూడా చదవండి: వీడియో: తెలుగు ఇండియన్ ఐడల్ షోకి గెస్ట్ గా బాలయ్య! షో అంతా దబిడిదిబిడే!
నిజానికి బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం. ఆయనకు ఎంత త్వరగా కొపం వస్తుందో.. అంతే త్వరగా కూల్ అవుతారు. ఇక చిన్న పిల్లలతో కూడా అంతే సరదాగా ఉంటారు. వారిలో ఒకరిలా కలిసిపోతారు. ఇక.. అఖండ సినిమాతో భారీ విజయం అందుకున్న బాలకృష్ణ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఇందులో అందరి దృష్టిని ఆకర్శిస్తున్న సినిమా #ఎన్బీకే107. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.