నేటికాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తే మనషుల్లో మానవత్వం అసలు ఉందా అనే సందేహం కలుగుతుంది. కొందరు బ్రతుకు దెరువు కోసం పట్టణాలకు వచ్చి అద్దె ఇంటిలో జీవనం సాగిస్తుంటారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఆ అద్దెకు ఉండే వారికి సదరు ఇంటి యజమాని సహయం అదిస్తారు. కానీ కొందరు దారుణంగా ప్రవర్తిస్తారు. ఎంతలా అంటే మానవత్వం మంటగలిసిపోయిందా? అనే అలా ప్రవర్తిస్తారు. తాజాగా ఓ యజమాని చేసిన పనికి సభ్య సమాజం అతడి ఛీత్కరిస్తుంది. తన ఇంటిలో ఉంటున్న వ్యక్తి అనారోగ్య కారణంగా మరణిస్తే.. మృతదేహాన్ని ఇంట్లో వద్దన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహంతో రోడ్డుపైనే ఉండిపోయారు. ఈ దారుణ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి లోని బీపీ అగ్రహారంలో బాషా అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్య కారణంలో బాషా మరణించాడు. ఈ సమయంలో ఇంటి తీసుక రావద్దని, ఇంటిముందు కూడా ఉంచేందుకు వీల్లేదనిహుకుం జారీ చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ కుటుంబ సభ్యులు తప్పని పరిస్థితుల్లో రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆటోలోనే ఉంచారు. ఆపై స్థానిక ఆటోడ్రైవర్లు ఆ సభ్యులకు కష్ట సమయంలో తోడుగా నిలిచారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి చనిపోయిన బాధలో ఉన్నవారి పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం చేశారు. ముందు ముందు ఇలాంటి సమస్య తలెత్తకుండా పరిష్కారంగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Rajasekhar (@Rajasek61450452) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.