చాలా మంది మహిళలకు ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. అయితే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆలోచనలను విరమించుకుంటారు. అయితే ఓ మహిళ మాత్రం.. సమాజం నుంచి ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ చేతిరాతను వ్యాపారంగా మార్చుకుంది.
ప్రతి ఒక్కరిలో ప్రతిభ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే అది సమయం వచ్చినప్పుడు వెలుగులోకి వచ్చి ఓ చరిత్రనే సృష్టిస్తుంది. అలా అనుకోకుండా తమ ప్రతిభతో వెలుగులోకి వచ్చి.. చరిత్రలో నిలిచిన వారు ఎందరో ఉన్నారు. అలానే సమాజం నుంచి ఎన్నో అవమానులు ఎదురైన ధైర్యంగా నిలబడి విజయం సాధించిన వారు ఉన్నారు. ఆ కోవాకు చెందిన వారే.. నిజాంపట్నం లక్ష్మి శీరిష. చేతిరాతతోనే తన తలరాతనే పూర్తిగా మార్చేసుకుంది. మరి.. ఆమె సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గుంటూరు జిల్లాకు చెందిన కంకిపాటి శ్రీనివాసరావు, పద్మావతి దంపతుల కుమార్తె లక్ష్మి శిరీష. శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. శిరీషకు 2014లో భరత్ భూషణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆయన బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శిరీషకు కూడా ఉద్యోగం చేయాలని కోరికగా ఉండేది. అయితే ఆ ప్రయత్నంలో ఉండగానే గర్భం దాల్చాడం.. తరువాత పిల్లలు పుట్టడంతో ఉద్యోగంపై ఆసక్తి తగ్గింది. ఇద్దరి పిల్లలను చూసుకుంటున్న క్రమంలో శిరిషాకు క్రాఫ్ట్స్ పై ఆసక్తి పెరిగింది. అలానే యూట్యూబ్ లో క్లాస్ లు వింటూ.. నాతిచరామి అనే సంస్థను ప్రారంభించారు. పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులను తయ్యారు చేసి.. ఆమె స్వయంగా మార్కెట్ కి వెళ్లి అమ్మేది.
ఆమె మొదటి సంపాదన రూ.500 .. అయితే తాను డబ్బు కంటే వ్యక్తిగత గుర్తింపు, పేరు కోసం పరితపించింది. ఇదే సమయంలో దగ్గరి వారు, స్నేహితులు చాలా మంది .. ఉద్యోగం చేత కాకనే ఇదంతా చేస్తుందని అన్నారు. వారు అనే మాటలకు ఒక్కొక్కసారి భయం వేసేది. అయినే ఆత్మవిశ్వాసంతో ఏదో సాధించాలని ముందుకు సాగాను. తాను ప్రారంభించిన ఫసీ, మెసీ అనే యూట్యూబ్ ఛానల్ బెడిసి కొట్టింది. ఇదే సమయంలో శీరిష పిల్లలు కాస్త పెద్ద వారయ్యారు. వారి చేతిరాతపై స్కూల్ నుంచి ఫిర్యాదులు వచ్చేవి.
పాపకు చేతిరాతను నేర్పడానికి.. మూడు నెలలలు నెట్ లో వెతికి స్వయంగా నేర్చుకున్నారు. అలానే తన పాపకు కూడా కర్శివ్ రైటింగ్ నేర్పింది. అది చూసి శీరిష ఇంటి చుట్టు పక్కల వారు కూడా వారి పిల్లలును చేర్పించారు. చివరకు అదే శీరిషకు ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం ఆమె 13 మందికి ఉపాధి కల్పిస్తుంది. అమెరికా,ఆస్ట్రేలియా, బ్యాంకాక్ .. ఇలా 9 దేశాల్లో ఆమె విద్యార్థులు ఉన్నారు. దాదాపు 5 వేల మందికి శీరీష్ శిక్షణ ఇచ్చారంట. ఇలా చేతిరాతతో శిరీష భారీగా ఆదాయం సంపాదింస్తుంది. ఆమె వ్యాపారం చేస్తూ ఎంతో మందిక మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మరి.. ఈమెపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.