ప్రముఖ సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు సి. నరసింహారావు తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సి. నరసింహారావు 29 డిసెంబరు 1948లో కృష్ణాజిల్లాలోని పెదపాలపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన ఎన్నో అద్భుతమైన రచనలు చేసి అందరి మన్ననలు అందుకున్నారు.
నరసింహారావు మృతి పట్ల మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. సి.నరసింహారావు వార్తల విశ్లేషణ చేయడంలో సిద్దహస్తులు. వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసేవారు. ప్రజల పక్షాన మాట్లాడే ఒక గొంతు మూగబోయింది.. అంతగొప్ప రాజకీయ విశ్లేషకుడు మరణించడం ఎంతో విచారకరం అన్నారు టీడీపీ నేత అచ్చెంనాయుడు.
ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు గారి మరణం విచారకరం. వ్యక్తిత్వ వికాసం పై ఆయన రాసిన అనేక పుస్తకాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/ZCiA3fhk7K
— N Chandrababu Naidu (@ncbn) May 12, 2022