ప్రముఖ సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు సి. నరసింహారావు తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సి. నరసింహారావు 29 డిసెంబరు 1948లో కృష్ణాజిల్లాలోని పెదపాలపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన ఎన్నో అద్భుతమైన రచనలు చేసి అందరి మన్ననలు అందుకున్నారు. నరసింహారావు మృతి పట్ల మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. […]