ప్రముఖ స్టార్ రైటర్ తండ్రి అయ్యారు. వారసుడు తమ ఇంట్లో అడుగుపెట్టిన ఆనంద క్షణాలను అనుభవిస్తున్నారు. ఒక సెన్సేషనల్ రైటర్ కి ఒక బుల్లి రైటర్ పుట్టేశాడు.
ఆయనొక స్టార్ రైటర్. స్క్రీన్ ప్లే రైటర్ గా, స్టోరీ రైటర్ గా పేరుంది. ఆయన పెన్ను పెడితే కథనం కేక పెట్టిస్తుంది. వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, లక్ష్యం, అల్లుడు శ్రీను, లౌక్యం వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన గోపీ మోహన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి ప్రవీణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డను తన చేతులతో ఎత్తుకుని దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్, వరుణ్ సందేశ్ సహా పలువురు ప్రముఖులు గోపీ మోహన్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. బుల్లి గోపీ మోహన్ పుట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. గోపీ మోహన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. యమజాతకుడు, వంశీ, నువ్వు నేను సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత 2002లో సంతోషం సినిమాతో స్క్రీన్ ప్లే రైటర్ గా మారారు.
వెంకీ, దుబాయ్ శీను, అశోక్, కింగ్, నమో వెంకటేశాయ, డిక్టేటర్, ఓహ్ బేబీ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశారు. ఈయన తన కెరీర్ లో ఎక్కువగా శ్రీను వైట్ల సినిమాలకు పని చేశారు. రెడీ, కింగ్, దూకుడు, షాడో, బ్రూస్ లీ వంటి సినిమాలకు స్టోరీ రైటర్ గా కూడా పని చేశారు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాష చిత్రాల్లో కూడా స్టోరీ రైటర్ గా పని చేశారు. రెడీ హిందీ రీమేక్ వెర్షన్ కి స్టోరీ రైటర్ గా పని చేశారు. గత ఏడాది అక్టోబర్ లో శ్రీనువైట్ల గోపీచంద్ హీరోగా ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి గోపీ మోహన్ రైటర్ గా ఉన్నారు. ప్రస్తుతం బిడ్డ పుట్టిన సంతోష సమయాలను ఆస్వాదిస్తున్నారు. మరి తండ్రైన సందర్భంగా సుమన్ టీవీ తరపున ఆయనకు అభినందనలు. మీరు కూడా ఆయనకు అభినందనలు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
Congratulations @Gopimohan garu 💐 pic.twitter.com/wwInUPsygV
— BANDLA GANESH. (@ganeshbandla) February 25, 2023